Flood Godavari : గోదావరి మహోగ్రరూపం, భద్రచాలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ ?
భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి ప్రవాహం 48 అడుగులకు చేరింది గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

Godavari Flows At Danger Mark
Flood Godavari : భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి ప్రవాహం 48 అడుగులకు చేరింది గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీ వరద వస్తోంది. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇది మరింత పెరిగే అవకాశమున్నట్టు అధికారులు చెబుతున్నారు.. గోదావరి వరద అంతకంతకూ పెరుగుతుండడంతో.. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Read More : Asteroid : భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. తాజ్ మహల్ కంటే 3 రెట్లు పెద్దదట!
మరోవైపు…తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమీప ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. గండి పోశమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. అమ్మవారి ఆలయ గోపురాన్ని వరద తాకింది.
Read More : Gun License Scam : తుపాకీ లైసెన్స్‌ల కేసులో సీబీఐ 40 చోట్ల దాడులు
సుమారు 60 అడుగులు గోదావరి ముందుకురావడంతో ఆలయం, దాని పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలు అన్నీ మునిగిపోయాయి. ఇక్కడ నివాసముంటున్న 40 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.