రద్దీకి చెక్.. కాకినాడ-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

ఈ కొత్త రైళ్ల ప్రకటన కాకినాడ-హైదరాబాద్ మార్గంలో తరచూ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.

రద్దీకి చెక్.. కాకినాడ-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Updated On : June 20, 2025 / 8:13 PM IST

పండగ సీజన్ వచ్చినా, సాధారణ రోజుల్లో అయినా కాకినాడ – హైదరాబాద్ మధ్య రైలు టికెట్ దొరకడం చాలా కష్టం. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక కీలక ప్రకటన చేసింది. కాకినాడ నుంచి హైదరాబాద్‌లోని లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లకు కొత్తగా వారానికి మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

కాకినాడ టౌన్ – చెర్లపల్లి (రైలు నం. 07447/07448)

  • 07447 (కాకినాడ – చెర్లపల్లి) 2025, జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు నడుస్తుంది
  • 07448 (చెర్లపల్లి – కాకినాడ) 2025 జూలై 6 నుంచి 2026 మార్చి 29 వరకు నడుస్తుంది

కాకినాడ టౌన్ – లింగంపల్లి (రైలు నం. 07445/07446)

  • 07445 (కాకినాడ – లింగంపల్లి) 2025 జూలై 2 నుంచి 2026 మార్చి 30 వరకు నడుస్తుంది
  • 07446 (లింగంపల్లి – కాకినాడ) 2025 జూలై 3 నుంచి 2026 మార్చి 31 వరకు నడుస్తుంది

Also Read: రైల్వే కీలక నిర్ణయం: వెయిట్‌లిస్ట్ టికెట్లపై భారీ కోత.. అసలు ఈ కొత్త రూల్ ఏంటి? ప్రయాణికులపై ప్రభావం ఎంత?

ఈ ప్రత్యేక రైళ్లలో సౌకర్యాలు

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని రకాల కోచ్‌లను ఏర్పాటు చేశారు.

  • 1AC (ఫస్ట్ క్లాస్ ఏసీ)
  • 2AC (టూ-టైర్ ఏసీ)
  • 3AC (త్రీ-టైర్ ఏసీ)
  • 3AC ఎకానమీ
  • స్లీపర్ క్లాస్
  • జనరల్ సెకండ్ క్లాస్

ఈ కొత్త సర్వీసులు ప్రస్తుతం ఉన్న రైళ్లపై భారాన్ని తగ్గించి, ప్రయాణికులకు మరిన్ని బెర్తులను అందుబాటులోకి తెస్తాయని రైల్వే అధికారులు అంటున్నారు. ఈ కొత్త రైళ్ల ప్రకటన కాకినాడ-హైదరాబాద్ మార్గంలో తరచూ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. టికెట్లను IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.