Telangana: గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో కొత్త పథకం
చిరుధాన్యాల పట్టీలను ప్రభుత్వం అందజేయనుంది.

తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం అవుతోంది. కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృత పథకాన్ని భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం నుంచి ఇవాళ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. “ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం” అన్న నినాదంతో ఈ సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
రాష్ట్రంలో 14 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి రోజు ఒక చిక్కీ ఇస్తారు. అలాగే, చిరుధాన్యాల పట్టీలను ప్రభుత్వం అందజేయనుంది. పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మొదట అమలు చేస్తున్నారు.
Also Read: అమెరికాలోని 3 లక్షల మంది చైనా విద్యార్థులకు షాక్… వారంతా ఇక ఇంటికే?
కౌమార బాలికలలో రక్తహీనత సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఆ వయసులోని అమ్మాయిల శరీరంలో సరిపడా రక్తం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ లేదా రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి సరైన ఆక్సిజన్ సరఫరా కాదు.
రక్తహీనత ఉంటే అలసట, బలహీనత, శరీరంలో నొప్పులు, శ్వాస తీసుకోవడంలో కష్టాలు వంటి వాటితో అమ్మాయిలు బాధపడతారు. ప్రధానంగా ఐరన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి.