Gig Workers: గిగ్ వర్కర్స్‌‌కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి కోసం స్పెషల్‌గా..

గిగ్ వర్కర్స్ పాలసీపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Gig Workers: గిగ్ వర్కర్స్‌‌కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి కోసం స్పెషల్‌గా..

Updated On : July 21, 2025 / 9:18 PM IST

Gig Workers: గిగ్ వర్కర్స్ కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం స్పెషల్ గా పలు సౌకర్యాలు కల్పించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గిగ్ వర్కర్స్ ప్రతిపాదిత పాలసీని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. గిగ్ వర్కర్స్ కు చట్టబద్ధమైన గుర్తింపు అంశాన్ని పాలసీలో ప్రతిపాదించారు అధికారులు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదన చేశారు.

గిగ్ వర్కర్స్ పాలసీపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్ లైన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్స్యూరెన్స్ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రతిపాదిత పాలసీపై మంత్రి వివేక్ తో కలిసి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలసీ గురించి అధికారులు వివరించినప్పుడు.. వారికి పలు సూచనలు చేశారు సీఎం రేవంత్. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆ బోర్డుకు ప్రభుత్వ ప్రాతినిథ్యం వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్ లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. ఈ నెల 25 నుంచి పంపిణీ.. కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) బిల్లు-2025ను రూపొందించింది. ఈ బిల్లుతో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడం, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం, అగ్రిగేటర్లపై బాధ్యతలను ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు దీనిపై సూచనలు, అభిప్రాయాల కోసం ప్రజలకు అందుబాటులో ఉంచారు.