రేపటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం

తెలంగాణలో రేపటి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా తెరుచుకోనున్నాయి. అన్ని జోన్లలో ప్రభుత్వం కార్యాలయాలు పని చేస్తాయి. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వందశాతం సిబ్బంది హాజరు కావాల్సిందే. రెడ్ జోన్లలో మాత్రం 33 శాతం సిబ్బందితోపాటు ప్రభుత్వ కార్యాలయాలు నడవనున్నాయి.
రెడ్ జోన్లలో ఉంటున్న ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఈమేరకు సోమవారం మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలు రెడ్ జోన్ లలో ఉన్నాయి. అన్ని జోన్లలో కొన్ని రంగాలకే సడలింపులు ఇచ్చారు.
మార్చి 23వ తేదీ నుంచి పాక్షిక సిబ్బందితోనే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. కొన్ని శాఖలు మాత్రం వంద శాతం సిబ్బందితో పని చేస్తున్నాయి. ఎషెన్షియల్ సర్వీసెస్ అందిస్తున్న శాఖలు మాత్రం వంద శాతం సిబ్బందితో పని చేస్తున్నాయి. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు అతి తక్కువ మంది సిబ్బందితో రొటేషన్ పద్ధతిలోనే నడస్తున్నాయి.
రెడ్ జోన్ మినహాయించి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు వంద శాతం సిబ్బందితో పని చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్దాయి. ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 11 వతేదీ నుంచి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వందశాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు పని చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సోమవారం నుంచి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేయనున్నాయి.