ధూంధాంగా బీఆర్ఎస్‌ రజతోత్సవ సభ.. తెలంగాణ ఆటపాట‌లు.. నినాదాలతో హోరెత్తిస్తున్న జనాలు

వారి ఆట‌పాట‌ల‌కు జనాలు డ్యాన్సులు చేశారు.

ధూంధాంగా బీఆర్ఎస్‌ రజతోత్సవ సభ.. తెలంగాణ ఆటపాట‌లు.. నినాదాలతో హోరెత్తిస్తున్న జనాలు

BRS

Updated On : April 27, 2025 / 6:37 PM IST

హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్‌ రజతోత్సవ సభ ధూంధాంగా జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ 25 ఏళ ఈ ఆవిర్భావ పండుగకు జనాలు భారీగా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనంతో సభ అట్ట‌హాసంగా కొన‌సాగుతోంది. బీఆర్ఎస్‌ శ్రేణులు జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు స‌భా వేదిక‌పై ప్రసంగాలు చేస్తున్నారు. వేదికపై తెలంగాణ పాట‌లు, నృత్యాలతో కళాకారులు అలరించారు. వారి ఆట‌పాట‌ల‌కు జనాలు డ్యాన్సులు చేశారు. ఈ సాంస్కృతిక ప్రోగ్రాంకు సభా వేదిక పక్కన ప్రత్యేకంగా ఒకో స్టేజీని వేశారు.

బీఆర్ఎస్‌ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఇది. తెలంగాణ నలుమూలల నుంచి జనాలు వచ్చారు. జనాలు ఎడ్లబండ్లతో పాటు సైకిళ్లు, బైకులు, కార్ల ర్యాలీలతో వచ్చారు.

వేసవి నేపథ్యంలో సభకు వచ్చేవారి కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లను జనాలకు అందుబాటులో ఉంచారు. మొత్తం 23 చోట్ల నుంచి ఈ సభను చూడడానికి భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను అమర్చారు. చాలా కాలం తర్వాత బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఆయన దాదాపు గంటన్నర పాటు ప్రసంగిస్తారని తెలుస్తోంది.