Kathula Kisan : 3 సార్లు గిన్నిస్ రికార్డు బద్దలుకొట్టాడు.. ఇప్పుడు అప్పడాలు అమ్ముతున్నాడు.

మూడు సార్లు గిన్నిస్ బుక్ రికార్డు బద్దలుకొట్టిన వ్యక్తి.. బొట్టకూటి కోసం నేడు అప్పడాలు అమ్ముతున్నాడు.

Kathula Kisan : 3 సార్లు గిన్నిస్ రికార్డు బద్దలుకొట్టాడు.. ఇప్పుడు అప్పడాలు అమ్ముతున్నాడు.

Kathula Kisan

Updated On : September 13, 2021 / 1:38 PM IST

Kathula Kisan :  కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది.. పేద మధ్యతరగతి ప్రజలు ఈ మహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులు పడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు కొద్దోగొప్పో నెట్టుకొస్తున్నా.. కళలపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. కరోనా కారణంగా ఈవెంట్లు లేక ఊర్లో కూలిపనులు వెళుతున్నారు. పెద్దపల్లి జిల్లా చిన్న కల్వల గ్రామానికి చెందిన ఆవుల (కత్తుల) కిషన్ గురించి చాలామందికి తెలిసిందే ఉంటుంది.

కిషన్ తన కంఠంలో కత్తులు పెట్టుకొని ప్రదర్శనలు ఇస్తుంటారు. ఇలా ప్రదర్శన ద్వారా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుండేవారు. గత 20 నెలలుగా ఎటువంటి ప్రదర్శనలు లేకపోవడంతో ఆయన ఇల్లు గడవడం చాలా కష్టంగా మారింది. దీంతో అప్పడాలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నారు.

Read More : Guinness Records: ఉల్లిపాయలాంటి చిన్నది..ఒక్క నిమిషంలో ఎన్నిడ్రెస్సులు మార్చిందో

కత్తుల కిషన్ రికార్డులు

కత్తుల కిషన్ మూడు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పోటీల్లో పాల్గొన్నారు. 2011లో ఇటలీలోని రోమ్ నగరంలో జరిగిన కత్తుల పోటీల్లో 23 కత్తులను గొంతులో పెట్టుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలో స్థానం సంపాదించాడు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటాడు. ఇంత ప్రతిభ ఉన్న కిషన్ ఇప్పుడు కుటుంబ పోషణ కోసం అప్పడాలు అమ్ముతున్నాడు. కిషన్ కి భార్య, ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు.

Read More : Sakshi Agarwal: సోకుల గాలమేసి చంపేస్తున్న సాక్షి!

ఐదుగురు కూతుళ్ళకి పెళ్లి చేశాడు. వీరి పెళ్లి కోసం 15 లక్షల రూపాయాల అప్పు చేశాడు కిషన్.. ప్రదర్శనలు లేకపోవడంతో పక్క ఊర్లో ఓ హోటల్ పెట్టాడు. అది సరిగా నడవకపోవడంతో తీసేసి మెషిన్ పనికి వెళ్ళాడు. ఇదే సమయంలో ప్రమాదవశాత్తు అతడి కాలికి గాయం కావడంతో రూ.2 లక్షలు ఖర్చయింది. అప్పులు పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు కిషన్.. ఈ నేపథ్యంలోనే కుటుంబ పోషణ కోసం అప్పడాల వ్యాపారం చేస్తున్నాడు.

మైక్ పట్టుకొని చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ అప్పడాలు అమ్ముతున్నాడు. తనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను ఆదుకోవాలని లేదంటే తనకు చావే శరణ్యమని వాపోయారు కత్తుల కిషన్.