Harish Rao: ఈయన లోకల్ వ్యక్తి.. బీదవాడు, అందరివాడు: మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్‌లో ఇప్పుడు హిందూ, ముస్లింలు మతసామర్యంతో కలిసి జీవించే వాతావరణం ఉందని తెలిపారు.

Harish Rao
Telangana elections-2023: జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాణిక్ రావు లోకల్ వ్యక్తి అని, బీదవాడు, అందరివాడని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో హరీశ్ రావుతో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పుడు హిందూ, ముస్లింలు మతసామర్యంతో కలిసి జీవించే వాతావరణం ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం పేరుతో ముస్లిం మైనారిటీల ఓట్లతో లబ్ధి పొందిందని హరీశ్ రావు చెప్పారు. ఆ పార్టీ హామీలకే పరిమితం అవుతుందని, వాటిని నెరవేర్చబోదని తెలిపారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతామని హామీ ఇచ్చి, ఆ మాటను నిలుపుకోలేదని అన్నారు.
ఆ పార్టీని నమ్మి ఓటేస్తే మునిగిపోతారని హరీశ్ రావు చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ విషయం గుర్తుంచుకోవాలని, ఇది కేసీఆర్ అడ్డా అని వ్యాఖ్యానించారు.
Telangana Congress: అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ తర్జనభర్జన.. టికెట్ల ప్రకటన ఎప్పుడు?