BRS MLA Harish Rao
రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామాలకు వస్తే అధికార పార్టీ నేతలను రైతులు నిలదీస్తున్నారని చెప్పారు.
రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ వరకు కాంగ్రెస్ ఇచ్చిన ఈ ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా అని నిలదీశారు. దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాలు విసిరారు. ఎకరానికి 9 వేల రూపాయలను ఏటా రైతులను ముంచుతున్నదని చెప్పారు.
మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్క పంటకు కూడా సరిగా ఇవ్వడం లేదని అన్నారు. 15 వేల రూపాయలు ఇస్తానని 9 వేల రూపాయలు ఎగ్గొట్టి, 6 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే కేవలం పది లక్షల మందికి మాత్రమే అంటున్నారని తెలిపారు.
ఉపాధిలో 90 లక్షల మందికి ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. ఒక ఎకరం భూమి ఉన్న వారిని కూడా రైతుల గుర్తించి రైతు భరోసా ఇవ్వాలని చెప్పారు. భూమి ఉన్నోళ్లకు నష్టం.. భూమి లేనోళ్లకు లాభం కలిగించేలా సర్కారు చర్యలు ఉన్నాయని తెలిపారు. ప్రతిపాదనలు చేసేటప్పుడు కనీస సోయి లేకుండా పోయిందని చెప్పారు.
రేవంత్ రెడ్డి బుకాయింపులకు మాని ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. గుండాలతో కొట్టించుడో, చిల్లరగాల్లతో తిట్టించుడు మానండంటూ హితవు పలికారు. అడుగడుగునా దగా చేస్తున్నారని, రైతుల్ని నట్టేట ముంచారని విమర్శించారు.
No helmet, No fuel Policy: హెల్మెట్ పెట్టుకోకపోతే పెట్రోల్ పోయొద్దని ప్రభుత్వం ప్రతిపాదన