No helmet, No fuel Policy: హెల్మెట్‌ పెట్టుకోకపోతే పెట్రోల్‌ పోయొద్దని ప్రభుత్వం ప్రతిపాదన

రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల కలెక్టర్లకు ఈ లేఖను పంపారు.

No helmet, No fuel Policy: హెల్మెట్‌ పెట్టుకోకపోతే పెట్రోల్‌ పోయొద్దని ప్రభుత్వం ప్రతిపాదన

Updated On : January 12, 2025 / 5:04 PM IST

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం “నో హెల్మెట్, నో ఫ్యూయల్” విధానాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం హెల్మెట్‌ లేకపోతే బైకుల్లో పెట్రోల్‌ పోయరు. ద్విచక్ర వాహనాలతో సంభవించే మరణాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలోని నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తారు.

ద్విచక్ర వాహనాలను నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. వెనుక కూర్చున్న వారికి హెల్మెట్‌ లేకపోయినా పెట్రోల్‌ బంకుల్లో పెట్రోలు పోయొద్దని నిర్వాహకులను ఆదేశిస్తూ రవాణా కమిషనర్ బ్రజేశ్ నారాయణ్ సింగ్ జనవరి 8న అధికారిక లేఖ జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల కలెక్టర్లకు ఈ లేఖను పంపారు.

ద్విచక్ర వాహనదారులు చాలా మంది హెల్మెట్లు ధరించడం లేదని తెలుపుతున్న డేటాను గుర్తు చేస్తూ ఈ లేఖను రాయడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు భద్రతా చర్యల సమీక్ష సందర్భంగా ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జారీ చేసిన ఆదేశాలను కూడా అందులో పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల వల్ల యూపీలో ప్రతి ఏడాది 25,000-26,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని సీఎం యోగికి డేటా ద్వారా తెలిసింది. ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మరణాలు హెల్మెట్‌లను ఉపయోగించకపోవడం వల్లే సంభవిస్తున్నాయని తేలింది.

ఈ విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని కోరాను: రేవంత్ రెడ్డి