Harish rao: అన్యాయం, అమానుషం అంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం.. ఏం జరిగిందో తెలుసా?
తనకు డిసెంబర్ నెల పింఛన్ ఇవ్వలేదని నంనూర్‌కు చెందిన డోకె చుక్కమ్మ మీడియాకు తెలిపారు.

Harish Rao
అన్యాయం, అమానుషం అంటూ అధికారులపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో తాజాగా వృద్ధాప్య పింఛన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేశారని హరీశ్ రావుకి దినపత్రికలో వచ్చిన ఓ వార్త ద్వారా తెలిసింది. దీనిపై హరీశ్ రావు ఎక్స్‌లో స్పందిస్తూ.. కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే అతడి తల్లికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు.
సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని హరీశ్ రావు చెప్పారు. ఇలా పింఛన్‌గా వచ్చే వాటిని సైతం ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే మరి ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎలాగని నిలదీశారు. అధికారంలోకి వస్తే ప్రతి నెల రూ.4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు వచ్చే రూ.2 వేల పింఛన్‌ను లాక్కోవడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు.
ఒకవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ, మరో వైపు చేతికందిన పింఛన్‌ను ఇంటి పన్ను బకాయిలో జమ చేయడం శోచనీయమని అన్నారు. హాజీపూర్ మండలంలోని నంనూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, తనకు డిసెంబర్ నెల పింఛన్ ఇవ్వలేదని నంనూర్‌కు చెందిన డోకె చుక్కమ్మ మీడియాకు తెలిపారు. ఎందుకు ఇవ్వలేదని అడిగితే తన కొడుకు పేరున ఇంటి పన్ను బకాయి ఉందని చెప్పారని, అందుకే తన పింఛన్ డబ్బులను పంచాయతీలో జమచేశామని అన్నారని అన్నారు. పన్ను కట్టేందుకు ఇప్పుడు తన కుమారుడు లేడని చెప్పారు. అతడు చనిపోయాడని, బతిమిలాడుకున్నప్పటికీ పింఛన్ ఇవ్వలేదని అన్నారు.
కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం.
ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి.
పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే, ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎట్ల?
అధికారంలోకి వస్తే ప్రతి… pic.twitter.com/ocKmIZ7AUD
— Harish Rao Thanneeru (@BRSHarish) January 23, 2025
Kakani Govardhan Reddy: కలెక్టర్‌పై మాజీ మంత్రి కాకాణి ఫైర్.. వారిని తొలగించే అధికారం నీకు లేదంటూ..