ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి తగ్గించారు: హరీశ్‌ రావు

రేవంత్‌ రెడ్డిది ఇచ్చిన మాట మీద కూడా నిలబడే వ్యక్తిత్వం కాదని అన్నారు.

ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి తగ్గించారు: హరీశ్‌ రావు

Updated On : October 30, 2024 / 3:22 PM IST

ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి తగ్గించారంటూ తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతున్న మాటలు బాగోలేవని చెప్పారు. మల్లన్న సాగర్‌లో 17 వేల ఎకరాలు ముంపునకు గురైందని, సీఎం మాత్రం 50 వేల ఎకరాలే అంటున్నారని అన్నారు.

అంతేగాక, హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయని మాట్లాడుతున్నారని హరీశ్ రావు చెప్పారు. రేవంత్‌ రెడ్డిది ఇచ్చిన మాట మీద కూడా నిలబడే వ్యక్తిత్వం కాదని అన్నారు. రుణమాఫీ పూర్తిగా ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఏడాదిలో ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, మంత్రి వర్గ విస్తరణ, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయలేకపోతున్నారని విమర్శించారు.

రాహుల్ గాంధీ కూడా చిల్లర మాటలు మాట్లాడి అబాసుపాలయ్యారని హరీశ్ రావు చెప్పారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నవాళ్లతోనే ఆయన జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలని, ఆ తరువాత మళ్లీ కేసీఆర్ అవుతారు సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. రేవంత్‌ రెడ్డి బీఆర్ఎస్‌ గురించి మాట్లాడడాన్ని మానుకోవాలని అన్నారు. ఓ మంత్రి ఇటీవలే గవర్నర్‌ను కలిశారని, మరో మంత్రి ఢిల్లీకి వెళ్లారని చెప్పారు.

Nampally Court : కేటీఆర్, నాగార్జున పిటీషన్లపై విచారణ వాయిదా