Nampally Court : కేటీఆర్, నాగార్జున పిటీషన్లపై విచారణ వాయిదా
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ వేరువేరుగా దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటీషన్ల పై

KTR Konda Surekha
Nampally Court : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ వేరువేరుగా దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటీషన్ల పై బుధవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖ తరపున న్యాయవాది గురుమిత్ సింగ్ హాజరయ్యారు. రెండు పిటీషన్ల పై విచారణను న్యాయస్థానం నవంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: Yash: వివాదంలో చిక్కుకున్న కన్నడ హీరో యశ్.. ప్రభుత్వం సీరియస్
తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా పిటీషన్ ను దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా తన గురించి కొండా సురే్ఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. ఇలా మొత్తం 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు.
Also Read: Darshan : అభిమాని హత్య కేసులో.. కన్నడ హీరో దర్శన్‌కు మధ్యంతర బెయిల్..
మరోవైపు హీరో అక్కినేని నాగార్జున వేసిన పిటీషన్ పై నాంపల్లి కోర్టులో అక్టోబర్ 23న విచారణ జరిగింది. ఓపెన్ కోర్టులో నాగార్జున తో పాటు సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రీయ, మెట్ల వెంకటేశ్వర్లు తమ వాగ్మూలాను ఇప్పటికే న్యాయమూర్తి ముందు రికార్డు చేశారు. నాగార్జున అందించిన ఆధారాలనుసైతం కోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది.