బతుకమ్మ ఆటలో ఆరోగ్యం

భారతీయులు చేసుకునే ప్రతీ పండుగలోను ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. ఆటా..పాటా..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటి మేళమింపే బతుకమ్మ పండుగ. బతుకమ్మ ఆట ఆడితే చక్కటి ఆరోగ్యం సొంతం అవుతుంది. ప్రకృతికి ఇచ్చి పూలతో బతుకమ్మలను పేర్చిస్తే ఆరోగ్యం..పూలలో ఉండే ఔషధాలు మనకు చాలా మేలు చేస్తాయి. అంతేకాదు..బతుకమ్మ ఆటలో చక్కటి ఆరోగ్య సూత్రాలున్నాయి. యోగాలో ఉండే చక్కటి ఆసనాలు ఈ బతుకమ్మ ఆటలో ఉన్నాయి. పాట పాడటం ఆరోగ్యం..ఆట ఆడటం ఆరోగ్యం..చప్పట్లు చరిస్తూ ఆడే బతుకమ్మ ఆటతో ఎంత ఆరోగ్యం ఉందో తెలుసుకుందాం..
-బతుకమ్మను మధ్యలో పెట్టి ..ముందుకు వంగితే పాద హస్తాసనం, చక్కగా నిలబడి చేతులు పైకెత్తితే తాడాసనాలు శరీరానికి చక్కటి ఎక్సర్ సైజుల్ని ఇస్తాయి.
-నడుము పై భాగాన్ని ముందుకు వంచితే ఆడితే జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. దీంతో చక్కటి ఆరోగ్యం వస్తుంది.
-ముందుకు వంగినప్పుడు వెన్నుపూస చక్కగా సాగుతుంది. దీంతో గుండె, ఊపిరితిత్తులకు చక్కటి వ్యాయామం జరిగి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఛాతిలోని ఎముకలపై ఒత్తిడి కలిగి చక్కగా రిలాక్స్ అవుతాయి.
-ముందుకు వంగి రెండు చేతులతో చప్పట్లు చరచడం ద్వారా అరచేతుల్లో ఒత్తిడి కలిగి, చేతి వేళ్ల నుంచి భుజాల వరకు రక్త ప్రసరణ పెరుగుతుంది.
-బతుకమ్మ ఆడుతున్నప్పుడు శరీరాన్ని నిటారుచేసి కుడికాలు కుడివైపు ఒక అడుగు జరిపి, ఎడమ కాలు ఎడమ వైపు జరుపుతారు. దీని ద్వారా పొత్తికడుపు నుంచి వెన్నుపూస వరకు ఎముకలు ..కండరాలకు చక్కటి వ్యాయామం కలుగుతుంది.
-కాళ్లు పక్కకు కదపడం..పాదాల నుంచి..మోకాళ్లు, తొడల్లోని కండరాలు, ఎముకలు, కీళ్లు, కండరాలకు బ్లడ్ సర్క్యేలేట్ అవుతుంది. దీంతో నొప్పులనేవే రాకుండా ఉంటాయి.
-బాడీ బాగా కిందికి వంగటంతో పొత్తికడుపుకు ఒత్తిడి పెరిగి అక్కడ చేరుకున్న కొవ్వు కరుగుతుంది. పాదాల నుంచి తల వరకు రక్త సరఫరా జరిగితే గుండెనొప్పి లాంటి సమస్యలు రావు. మెదడు కూడా చురుకుగా ఉంటుంది.శరీరానికి చక్కటి వ్యాయామం కలగతంతో మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది.
బిజీ బిజీ లైఫ్. పని ఒత్తిడి. ఒక్కచోటే కూర్చుని చేసే పని. దీంతో ఎన్నో అనారోగ్యాలు. దీంతో డాక్టర్ దగ్గరకు పరుగులు. వేలకొద్దీ డబ్బులు ఖర్చు. చిన్నపాటి సమస్యలకే ఆపరేషన్లు. మహిళల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా ఆపరేషన్. దీంతో ఆరోగ్యం పోతుంది. డబ్బు ఖర్చు. జీవన శైలిలో వస్తున్న మార్పులతో ఎన్నో రోగాలు. ఇటువంటి ఎన్నో సమస్యలకు బతుకమ్మ ఆటా పాటా ఓ వరం అనే చెప్పుకోవాలి. మన పూర్వికులు అక్షరరూపంలోని సంస్కృతిని ఆచరణలో మనకు అందించిన సంప్రదాయం బతుకమ్మ.
మహిళలు ఆరోగ్యంగా ఉండే చక్కని అవకాశం బతుకమ్మ ఆటాపాటా. బతుకమ్మ ఆటలో లయబద్ధంగా కదలటం ఓ ప్రత్యేకత.ఈ ఆటలో చేతులు భూమిని తాకేలా వంగాలి. ఆ చేతులను మళ్లీ పైకెత్తటం..పక్కకు తిప్పటం. చప్పట్లు కొట్టటం పాటలు పాడటం ఇలా బతుకమ్మ ఆటలో అంతా ఆరోగ్యమే. మరి పూర్వంలో ఇటువంటి ఆటలు..పాటతో చేసుకునే బతుకమ్మ పండగ చేసుకోవటంతో ఎటువంటి నొప్పులు లేకుండా చక్కటి ఆరోగ్యంగా ఉండేవాళ్లమని బామ్మలు..అమ్మమ్మలు చెబుతుంటారు.మరి అటువంటి బతుకమ్మ ఆటను ఆడండి..ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.