వడగాలులు వచ్చేశాయ్…IMD హెచ్చరిక

  • Published By: venkaiahnaidu ,Published On : March 7, 2019 / 06:35 AM IST
వడగాలులు వచ్చేశాయ్…IMD హెచ్చరిక

మండే ఎండల కాలం వచ్చేసింది. హైదరాబాద్ సిటీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. దాదాపు ప్రతి సమ్మర్ లో ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. భగభగమండే వడగాలుల కారణంగా వడ దెబ్బ తగిలి వృద్ధులు చనిపోవడం, అనేకచోట్ల అడవులు తగలబడిపోవడం,ఇళ్లు కాలిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించేందుకు బుధవారం(మార్చి-6,2019) సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(CESS)లో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ(TSDPS),IMD-హైదరాబాద్,IMS,యూనిసెఫ్,ఫైర్ సర్వీస్ డిపార్ట్ మెంట్,స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ లు కలిసి సంయుక్తంగా నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న రీసెర్చర్లు మాట్లాడారు.

మండే ఎండల కారణంగా ప్రాణనష్టం,ఆస్తినష్టం జరుగకుండా ముందుజాగ్రత చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని,ప్రతి ఒక్కరి దగ్గరి ఈ అవేర్ నెస్ క్యాంపెయిన్ ను తీసుకెళ్తామని హైదరాబాద్ భారత వాతావరణశాఖ(IMD) హైదరాబాద్ డైరక్టర్ వైకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 2018లో వడగాలుల కారణంగా చనిపోయినవారి సంఖ్య బాగా తక్కువగా ఉన్నప్పటికీ.. ఇప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతులు నమోదవడమే దీనికి కారణమన్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని,మరి కొన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు.ఈ ఏడాది సమ్మర్ లో 15-20 రోజులు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని కోసం ఓ యాక్షన్ ప్లాన్ ను ఈ సందర్భంగా రూపొందించారు. ముఖ్యమైన ప్లేస్ లలో ఎల్ఈడీ వాతావరణ సూచన బోర్డుల ఏర్పాటు,సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వర్క్ షాప్స్ నిర్వహణ,ఉచిత నీటి సరఫరా పాకల ఏర్పాటు,తదితర చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వాతావరణాన్ని సూచించేందుకు TSDPS నాలుగు అలర్ట్ లను ముందుంచింది. సాధారణ ఉస్ణోగ్రతకు తెలుపురంగు, వడగాలుల వార్నింగ్ కు పసుపు రంగు,తీవ్రమైన వడగాలులు ఉంటే ఎరుపురంగు,ఓ మొస్తారు వేడి గాలులు ఉంటే ఆరెంజ్ రంగులను అలర్ట్ గా తీసుకొచ్చారు.