Heavy Rains : రాగల మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది.

Telangana Heavy Rains (2)
Heavy Rains In Telangana : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న ఉత్తర అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం ఈరోజు ఉత్తర కోస్తా కర్నాటక, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రం మట్టానికి 4.5 కిమీ ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది.
నిన్న తమిళనాడు కోస్తా వద్ద నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఈరోజు అదే ప్రాంతంలో సగటు సముద్రం మట్టంకి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వెల్లడించింది. ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
IMD Issues Yellow Alert : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు…ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది.