Ramappa Historical Treasures : రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టులో విచారణ

రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మీడియా కథనాల ఆధారంగా హైకోర్టు కేసు విచారణను సుమోటోగా చేపట్టింది.

Ramappa Historical Treasures : రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టులో విచారణ

High Court

Updated On : July 28, 2021 / 5:42 PM IST

Ramappa historical treasures : రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మీడియా కథనాల ఆధారంగా హైకోర్టు కేసు విచారణను సుమోటోగా చేపట్టింది. యునెస్కో విధించిన గడువు వరకు సమగ్ర సంరక్షణ చేపట్టాలని తెలిపింది. డిసెంబర్ నెలాఖరులోగా సమగ్ర సంరక్షణ చేపట్టాలని ఆదేశించింది. ఏఎస్సై, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఆగస్టు 4న కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని సూచించింది. క్షేత్రస్థాయిలో సంయుక్త పరిశీలన జరిపి 4 వారాల్లో కమిటీ నివేదిక సమర్పించాలని తెలిపింది. రామప్ప కట్టడం చారిత్రకంగా అత్యంత విలువైనది.. యునెస్కో విధించిన గడువులోగా కార్యాచరణ చేపట్టి శాశ్వత గుర్తింపు దక్కించుకోవాలని తెలిపింది.

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుందని హైకోర్టు తెలిపింది. రామప్ప అభివృద్ధి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తామని తెలిపింది. తదుపరి విచారణ ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది.