TGPSC: గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల రీవాల్యుయేషన్ జరిపించాలని పిటిషన్.. టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు
తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు.

High Court
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరిపించాలని హైకోర్టులో అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. గ్రూప్ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే దిద్దించారని పిటిషనర్లు చెప్పారు.
మూడు భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని అన్నారు. ఒకేరకమైన నిపుణులతో తెలుగు, ఇంగ్లిష్ మీడియం పేపర్లు దిద్దించారని పిటిషన్లు తెలిపారు. ఒకే నిపుణుడితో రెండు భాషల పేపర్లు దిద్దించడంతో నాణ్యత కొరవడిందని అన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు.
పిటిషనర్ల వాదనల తర్వాత టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ వేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను మార్చి 10న టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది.
Also Read: టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదముద్ర.. ఎన్ని వేల కోట్ల రూపాయలంటే?