Huzurabad : హుజూరాబాద్ బీజేపీలో మొదలైన వర్గపోరు

ఈటల రాక.. బీజేపీలో కాక.. రైమింగ్ కోసం రాసిన లైన్ కాదిది. కమలం పార్టీలో ఉన్న లేటెస్ట్ సిచ్యువేషన్ ఇది. ఈటల రాజేందర్ ఢిల్లీ ఫ్లైట్ దిగాక ఉన్న పరిస్థితులు.. సాయంత్రానికి మారిన పరిణామాలు.. హుజురాబాద్ రాజకీయంపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయ్.

Huzurabad : హుజూరాబాద్ బీజేపీలో మొదలైన వర్గపోరు

Huzurabad Is Class Struggle That Started In The Bjp

Updated On : June 16, 2021 / 7:44 AM IST

Huzurabad  : ఈటల రాక.. బీజేపీలో కాక.. రైమింగ్ కోసం రాసిన లైన్ కాదిది. కమలం పార్టీలో ఉన్న లేటెస్ట్ సిచ్యువేషన్ ఇది. ఈటల రాజేందర్ ఢిల్లీ ఫ్లైట్ దిగాక ఉన్న పరిస్థితులు.. సాయంత్రానికి మారిన పరిణామాలు.. హుజురాబాద్ రాజకీయంపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయ్. ఈటల చేరికతో రాష్ట్రవ్యాప్తంగా కాషాయ శ్రేణులు పండగ చేసుకుంటుంటే.. బీజేపీ నేత పెద్దిరెడ్డి మాత్రం తన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకునే పనిలో పడ్డారు. ఈ లెక్కన.. హుజురాబాద్ బీజేపీలో.. అప్పుడే వర్గపోరు మొదలైందా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాక.. కమలం పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఆయన.. ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకొని.. హైదరాబాద్ ల్యాండ్ అవగానే.. పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పాయ్. ఇక రాబోయే రోజుల్లో.. బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని.. ఆ పార్టీ కేడర్ నమ్ముతోంది. లీడర్లు కూడా విశ్వాసంగా ఉన్నారు. సరిగ్గా.. ఇలాంటి టైంలో.. ఊహించని పరిణామం జరిగింది. ఈటల చేరికపై.. బూత్ లెవెల్ కార్యకర్త నుంచి రాష్ట్ర, ఢిల్లీ స్థాయి నేతల దాకా అంతా హ్యాపీగానే ఉన్నా.. కొంతకాలం క్రితమే.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన పెద్దిరెడ్డి మాత్రం అసంతృప్తిగా ఉన్నారు.

బీజేపీలో ఈటల రాజేందర్‌ను చేర్చుకోవడాన్ని.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆయన వాదనను పట్టించుకోకుండా.. ఈటలకు కాషాయ కండువా కప్పేశారు. అందుకే.. ఇప్పుడు హుజురాబాద్ బీజేపీలో వర్గపోరు మొదలైంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. తన పొలిటికల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. హుజురాబాద్‌లో పర్యటించేందుకు రెడీ అయ్యారు.

3నెలలుగా.. నియోజకవర్గానికి దూరంగా ఉన్న పెద్దిరెడ్డి.. సడన్‌గా టూర్‌కు సిద్ధమయ్యారు. ఈ రోజు రేపు ఆయన  హుజురాబాద్‌లో నియోజకవర్గంలో పర్యటించి బీజేపీ కార్యకర్తలతో  నేడు సమావేశం కానున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. ముందు నుంచీ హుజురాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరినప్పుడే.. కమలనాథులు ఆయనకు టికెట్‌పై హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.  దీంతో.. ఆయన నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో.. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు. ఇలాంటి టైంలో.. ఈటల బీజేపీలోకి చేరడాన్ని పెద్దిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈటల రాకను వ్యతిరేకించినా.. హైకమాండ్ మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరీ.. కాషాయ కండువా ఆయనకు కప్పేసింది. దీనిపైనే.. కార్యకర్తలతో తేల్చుకోవాలని డిసైడ్‌అయ్యి.. హుజూరాబాద్ బాటపట్టారు పెద్దిరెడ్డి.

ఇదిలా ఉంటే.. ఈటల చేరికపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. పార్టీలో చేరిన రోజే.. ఈటలకు అవమానం జరగడం చూస్తుంటే జాలేస్తోందన్నారు టీఆర్ఎస్ నేత   కడియం శ్రీహరి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరతారనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదన్నారు. అయితే.. ఢిల్లీలో ఈటలకు అవమానం జరిగిందనడంలో అర్థం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. పార్టీ నిబంధనల మేరకే.. ఆయనకు సభ్యత్వం ఇచ్చామన్నారు. కొందరు.. కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం మానుకోవాలన్నారు.

ఇక.. కమలం పార్టీ నాయకులు, కేడర్ కోరుకున్నట్లుగానే.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. టీఆర్ఎస్‌లో.. కొన్నేళ్ల పాటు క్రియాశీలకంగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు కమలదళంలో ఎలా పనిచేస్తారు.. త్వరలోనే రాబోయే హుజురాబాద్ ఉపఎన్నికను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది.