డిజిటల్ హౌస్ అరెస్ట్ గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి: పోలీసులు 

Cyber Security Bureau: బాధితులను ఇలా భయపెట్టి వారి నుంచి బ్యాంకు వివరాలను సేకరిస్తారు. అలాగే, వారి మొబైల్..

డిజిటల్ హౌస్ అరెస్ట్ గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి: పోలీసులు 

Cyber Fraud

కేటుగాళ్లు ప్రజలను మోసం చేసి డబ్బులు రాబట్టేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల డిజిటల్ హౌస్ అరెస్టులు పెరిగిపోతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. డిజిటల్ హౌస్ అరెస్ట్ అంటే తాము ప్రభుత్వ అధికారులమంటూ కేటుగాళ్లు ఫోన్ చేస్తారు.

పోలీసులు, కస్టమ్, సీబీఐ లేదా ఎన్ఐఏ అధికారులమని చెప్పుకుంటారు. ‘మీ మీద విచారణ జరపాలని మాకు ఆదేశాలు వచ్చాయి. మీ బ్యాంకు ఖాతాతో లింకై ఉన్న సిమ్ కార్డు, ఆధార్ కార్డులను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించినట్లు మాకు తెలిసింది. మీకు ఇంట్లో నుంచి కదలొద్దు, కొన్ని గంటలపాటు మీ స్నేహితులు, బంధువులతో మాట్లాడొద్దు’ అని కేటుగాళ్లు చెబుతారు.

కొన్ని ప్రశ్నలు అడుగుతామని అందుకు సమాధానం చెప్పాలని అంటారు. బాధితులను ఇలా భయపెట్టి వారి బ్యాంకు వివరాలను సేకరిస్తారు. అలాగే, వారి మొబైల్ లో ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలని చెబుతారు. దానితో బాధితుడి బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు.

ఇలాంటి మోసాల్లో ఇరుక్కోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చెప్పారు. తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎత్తకూడదని సూచించారు.

Sowmya Janu : తనని అరెస్ట్ చేయొద్దంటూ.. కోర్టును ఆశ్రయించిన సౌమ్య జాను..