CP CV Anand : ప్రశాంతంగా పాతబస్తీ.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు

హైదరాబాద్ పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. శుక్రవారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు సీపీ ఆనంద్. అలజడి సృష్టించేందుకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకోవటంతో శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు.

CP CV Anand : ప్రశాంతంగా పాతబస్తీ.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు

Updated On : August 26, 2022 / 11:23 PM IST

CP CV Anand : హైదరాబాద్ పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. శుక్రవారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు సీపీ ఆనంద్. అలజడి సృష్టించేందుకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకోవటంతో శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు.

గొడవలతో ఎలాంటి నష్టం వాటిల్లుతుందో హైదరాబాదీలకు తెలుసని సీవీ ఆనంద్ అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై నిఘా ఉంచామని హెచ్చరించారు. పాతబస్తీలో తాత్కాలిక కర్ఫ్యూని సడలిస్తామని, యధావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చని సీపీ తెలిపారు.