రేపే గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌.. అంతా సిద్ధం

  • Published By: sreehari ,Published On : November 30, 2020 / 07:29 AM IST
రేపే గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌.. అంతా సిద్ధం

Updated On : November 30, 2020 / 10:16 AM IST

Hyderabad Greater Elections : గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇప్పటికే 9 వేల 101 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు.. బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకానుంది.



సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. 150 డివిజన్ల పరిధిలో మొత్తం 11 వందల 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 74 లక్షల 67 వేల 256మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 38లక్షల 89వేల 637మంది పురుషులు.., 35లక్షల 76వేల 857మంది మహిళా ఓటర్లు ఉన్నారు.. ఇతరులు 678 మంది ఓటు వేయనున్నారు.

పోలింగ్ విధుల్లో 36 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. 9 వేల 101 మంది ప్రిసైండింగ్ అధికారులు, 9 వేల 101మంది అసిస్టేంట్ ప్రిసైండింగ్ అధికారులను నియమించారు. 60 ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు.., 30స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.



17 వందల మంది మైక్రో అబ్జర్వర్స్‌.. 2 వేల 920 మంది వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షకులను నియమించింది. పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు…, 30 సర్కిల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.

ఈ సారి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుండటంతో 28 వేల 500 బాక్స్ లు ఉపయోగించున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బాక్స్ లు అందించనున్నారు.



ఇక మొత్తం 2 వేల 629 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు రాగా.. 19 వందల 26పోస్టల్ బ్యాలెట్లు ఇష్యూ చేశారు. సిటీలో మొత్తం 2700 సెన్సిటివ్ కేంద్రాలుండగా.., 532 సమస్యాత్మక కేంద్రాలున్నాయి.

308 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు అధికారులు. క్రిటికల్ పోలింగ్‌ స్టేషన్లు 257.. 73 క్రిటికల్ పోలింగ్‌ ఏరియాలను ఐడెంటిఫై చేశారు. 30 వేలకు పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను వినియోగించనున్నారు.



పోలింగ్‌ కేంద్రాల్లో వృద్ధులు.., మహిళలు, వికలాంగులకు సహకరించేందుకు వాలంటీర్లను సిద్దం చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీల్‌చైర్లను అందుబాటులో ఉంచుతున్నారు.
https://10tv.in/1122-candidates-contest-in-ghmc-elections-polling-on-december-1-says-sec-parthasarathy/
కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి మాస్క్ లు ఇవ్వడంతో పాటు…, ప్రతి పోలింగ్ కేంద్రానికి 2.5 లీటర్ల శానిటైజర్ కూడా అందించాలని నిర్ణయించారు. అందుకోసం 60వేల లీటర్ల శానిటైజర్స్‌ సిద్దం చేశారు అధికారులు.