Jubilee Hills Honeytrap : కొడుకు గలీజ్ పనులకు తల్లి మద్దతు.. మైనర్ బాలికలే టార్గెట్ గా.. ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేస్తూ.. లక్షల్లో డబ్బు వసూల్
Jubilee Hills Honeytrap : జూబ్లీహిల్స్ హనీట్రాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లి సహకాారంతోనే నిందితుగు మైనర్లను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేశాడని వెల్లడైంది.
hyderabad jubilee hills honeytrap case police arrest young man and his mother
Jubilee Hills Honeytrap : తప్పు చేస్తే కన్నబిడ్డ అయినా సరే కఠినంగా శిక్షించే మాతృమూర్తులు ఎందరో ఉన్నారు. బిడ్డలు చెడు మార్గంలో పయనిస్తూ ఉంటే.. తల్లే వారిని సక్రమమైన మార్గంలో పయనించేలా చూడాలి. కానీ నేటి కాలంలో కొందరు కిరాతక తల్లులు తెర మీదకు వస్తున్నారు. పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసి మందలించకపోగా.. వారిని మరింత ప్రోత్సాహిస్తూ.. సిగ్గుతో సమాజం తలదించుకునే నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ తల్లి, కొడుకుల గలీజ్ దందా వెలుగుచూసింది. డబ్బున్న మైనర్ బాలికలే లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేసి, ప్రేమ పేరుతో నమ్మించి.. ఆపై లోబర్చుకుని వీడియోలు రికార్డ్ చేసి.. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న తల్లి, కొడుకుల బాగోతం జూబ్లీహిల్స్‌లో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌కు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. జాబ్ లాంటివి చూసుకోకుండా.. కష్టపడకుండా.. సులభంగా డబ్బులు సంపాదించాలని భావించాడు. ఇందుకు గాను ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకున్నాడు. డబ్బున్న కుర్రాడిలా కలరింగ్ ఇవ్వడం కోసం ఖరీదైన బట్టలు ధరించి.. లగ్జరీ హోటల్స్, రెస్టారెంట్లు, రిసార్ట్లు, టూర్స్ అంటూ పలు లొకేషన్లలో రీల్స్ చేస్తూ.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేవాడు.
లైక్ చేసిన వారిలో మైనర్లే టార్గెట్
ఈ రీల్స్ చూసి లైక్ చేసిన వారిలో బాలికల వివరాలు సేకరించి.. వారిని టార్గెట్ చేసుకునేవాడు. ముందుగా స్నేహం పేరుతో మైనర్ బాలికలతో పరిచయం పెంచుకుని.. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని నమ్మబలికేవాడు. ఆపై వారికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని.. శారీరకంగా వాడుకునేవాడు. ఆ సమయంలో బాలికలకు తెలియకుండా వీడియోలు, ఫోటోలు తీసేవాడు. ఆపై అతడి కోరిక తీరిన తర్వాత.. అప్పటికే తన వద్ద ఉన్న బాలికల సన్నిహిత ఫోటోలు, వీడియోలను చూపిస్తూ వాటిని బయటపెడతానంటూ.. లక్షల్లో డబ్బులు వసూలు చేసేవాడు.
ఇలా అర్జున్ పదుల సంఖ్యలో మైనర్ బాలికలను ట్రాప్ చేసి.. వారిని బెదిరించి భారీగా డబ్బులు గుంజాడు. ఈ క్రమంలో గత నెలలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మైనర్ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అర్జున్.. పైన చెప్పిన విధంగానే.. ఆ బాలిక వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అయితే బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఈ గలీజ్ దందా వ్యవహారం తెర మీదకు వచ్చింది. సదరు బాలిక తన కుటుంబ సభ్యుల సహకారంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మైనర్ బాలికలను ప్రేమ పేరుతో నమ్మించి ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ముందుగా చంద్రశేఖర్ ఆజాద్‌ను, ఆ తర్వాత మరో నిందితుడు రాజును రిమాండ్‌కు తరలించారు. చంద్రశేఖర్ ఆజాద్ తల్లి మీనాకుమారి సహా మరో నలుగురు ఈ నేరాలు చేసేందుకు ప్రోత్సహించినట్లు తేలడంతో తాజాగా వారిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
