Hyderabad: అందంగా ఉందని ఆశపడి.. ఈ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చారో..
కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి ప్లీజ్ అంటూ కారులో ఎక్కింది. ఆ తర్వాత తన బట్టలను తానే చించుకుంది..

Sulthana
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో యువకులను బెదిరించి డబ్బులు గుంజుతున్న ఓ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలు రోడ్డుపై కనపడగానే చాలు.. లిఫ్టు కావాలా మేడమ్ అని అడుగుతుంటారు కొందరు అబ్బాయిలు. అటువంటి వారిని గమనించిన సయీదా నయీమా సుల్తానా(32) అనే మహిళ ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది.
యువకులను టార్గెట్‌గా చేసుకుని డబ్బులు లాగాలనుకుంది. అందంగా తయారై రోడ్ల పక్క నుంచి తిరుగుతుంది ఆమె. రోడ్ల మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడుగుతోంది. వాహనంలో ఎక్కిన కొద్దిసేపటి తర్వాత తనను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించావంటూ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తితో అంటోంది ఈ కిలాడీ లేడీ.
అత్యాచారయత్నం చేశావని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తుంది. తాజాగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఓ యువకుడిని లిఫ్ట్ అడిగి ఎక్కింది సుల్తానా. కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి ప్లీజ్ అంటూ కారులో ఎక్కింది. ఆ తర్వాత తన బట్టలను తానే చించుకుంది.
అత్యాచార కేసు పెడతానని బెదిరించింది. దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులకు బాధిత డ్రైవర్ పరమానంద ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సయీదా నయీమా సుల్తానాను అరెస్ట్ చేశారు. గతంలోనే ఆమెపై పలు కేసులు ఉన్నాయి.