Lizard In Biryani : బాబోయ్.. చికెన్ బిర్యానీలో కనిపించిన బల్లి, షాక్‌లో కుటుంబసభ్యులు

ఈ ఘటన వైరల్ గా మారింది. నెటిజన్ల విస్మయం వ్యక్తం చేశారు. చాలా దారుణం అని వాపోయారు. రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ల వైఖరిపై సీరియస్ అవుతున్నారు.

Lizard In Biryani : బాబోయ్.. చికెన్ బిర్యానీలో కనిపించిన బల్లి, షాక్‌లో కుటుంబసభ్యులు

Chicken Biryani

హైదరాబాద్ లో ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ఆన్ లైన్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో ఏముందో చూసి వారు షాక్ కి గురయ్యారు. చికెన్ బిర్యానీలో చనిపోయిన బల్లి ఉంది. హైదరాబాద్ లో నివాసం ఉండే ఓ కుటుంబం బిర్యానీని టేస్ట్ చేయాలని అనుకుంది. అసలే బిర్యానీకి హైదరాబాద్ చాలా ఫేమస్. నగరంలో రుచికరమైన వెరైటీ బిర్యానీలు దొరుకుతాయి.

చికెన్ బిర్యానీ తిందామని ఓ కుటుంబం ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది. కాసేపటికి చికెన్ బిర్యానీ పార్సిల్ ఇంటికి వచ్చింది. పార్సిల్ ను ఓపెన్ చేసి ప్లేట్ లో వడ్డించుకున్నారు. లొట్టలేసుకుంటూ బిర్యానీ లాగిద్దామని వారు అనుకున్నారు. అయితే, పార్సిల్ ఓపెన్ చేసి ప్లేట్ లో వడ్డించుకోగానే వారికి షాక్ కొట్టినంత పనైంది. ఆ బిర్యానీలో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో వారు బిత్తరపోయారు.

బిర్యానీలో బల్లి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు దాన్ని వీడియో తీశారు. తమకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన వైరల్ గా మారింది. ఈ సంఘటనపై నెటిజన్ల విస్మయం వ్యక్తం చేశారు. చాలా దారుణం అని వాపోయారు. రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ల వైఖరిపై సీరియస్ అవుతున్నారు. శుభ్రత, నాణ్యత, భద్రత పాటించడం లేదని మండిపడ్డారు. ఆ ఫుడ్ సప్లయ్ చేసిన రెస్టారెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెస్టారెంట్ నిర్లక్ష్యమే దీనికి కారణం అని, ఇలాంటి ఘటనలు మరోసారి జరక్కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇందులో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ ల తప్పేమీ లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. వారేమీ ఫుడ్ తయారు చేయరు, కనీసం ప్యాక్ కూడా చేయరు, కేవలం ఫుడ్ డెలివరీ మాత్రమే చేస్తారని చెప్పుకొచ్చారు. ఇందులో వారిని తప్పుపట్టడం కరెక్ట్ కాదన్నారు. ఇది పూర్తిగా రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్యమే అని పేర్కొన్నారు. కొన్ని రెస్టారెంట్లు ఆహారం తయారు చేయడంలో కానీ ప్యాక్ చేయడంలో కానీ శుభ్రత, నాణ్యత పాటించడం లేదన్నారు. ఇక, ఇలాంటి ఘటనలు దృష్టికి వచ్చినప్పుడల్లా ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా, రెస్టారెంట్ కి వెళ్లి తినాలన్నా భయమేస్తోందని నెటిజన్లు వాపోయారు.

 

 

View this post on Instagram

 

A post shared by What Now? India | Culture, History, Viral News (@what.now.media)