Hyderabad Metro MD : బిగ్ షాక్.. మెట్రో రైల్ ఎండీతో సహా 177 మంది రిటైర్డ్ అధికారుల తొలగింపునకు ఉత్తర్వులు..!

Hyderabad Metro MD : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) తొలగించిన 177 మంది రిటైర్డ్ అధికారులలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఎండీ, ఎన్వీఎస్ రెడ్డి కూడా ఉన్నారు.

Hyderabad Metro MD : బిగ్ షాక్.. మెట్రో రైల్ ఎండీతో సహా 177 మంది రిటైర్డ్ అధికారుల తొలగింపునకు ఉత్తర్వులు..!

Hyderabad Metro MD among 177 retired staff to be relieved by March 31

Updated On : March 28, 2025 / 12:56 AM IST

Hyderabad Metro MD : మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ సహా రిటైర్డ్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా డ్యూటీలో కొనసాగుతున్న అధికారులను ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) విభాగంలో మార్చి 31 నాటికి  177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగించనున్నారు. వీరిలో హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి కూడా ఉన్నారు.

Read Also : SRH vs LSG : అయ్యో.. హైదరాబాద్.. లక్నో చేతిలో ఓటమి.. అదరగొట్టిన పూరన్‌, మార్ష్‌..!

హెచ్ఎండీఏ నుంచి 64 మంది రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగుతున్న అధికారులను టర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో 46, వాటర్ బోర్డులో 7 మందిని టెర్మినేట్ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) ఆదేశాలిచ్చింది.

మేయర్ (OSD)గా పనిచేస్తున్న విజయ్ కృష్ణ, మేయర్ పేషన్‌లో పనిచేస్తున్న రాజు కుమార్‌ను కూడా టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరందర్నీ వెంటనే టాప్ ప్రయారిటీపై తొలగించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు ఆదేశాలిచ్చారు. ఇందులో మెట్రో రైల్ ఎండీతో పాటు 28 మందిని సైతం అధికారులు తొలగించారు.

2007లో హైదరాబాద్ మెట్రో రైల్ ఏర్పడినప్పటి నుంచి ఎన్వీఎస్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు, ఆయన జీహెచ్ఎంసీ ట్రాఫిక్, రవాణా విభాగానికి అదనపు కమిషనర్‌గా కూడా పనిచేశారు. (IRAS) అధికారిగా తన సర్వీసును విడిచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. పర్మినెంట్ ఎండీగా అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన పదవీకాలం కొనసాగింది.

HMWSSB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమ్ సత్యనారాయణ, టీజీ (RERA) జాయింట్ కలెక్టర్ ఎస్ సత్తయ్య, ఫార్ములా ఇ-రేస్ కేసులో పేరున్న హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవుల నుంచి వైదొలిగారు.

MAUD మెమో ప్రకారం.. అన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సచివాలయ విభాగాల ప్రధాన కార్యదర్శులు మార్చి 31 నాటికి రిటైర్మెంట్ తర్వాత పనిచేస్తున్న అన్ని రిటైర్డ్ ఉద్యోగుల సర్వీసులు, నియామకం, కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన, వేతనం, కార్పొరేషన్లు, బోర్డులు, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లోని అన్ని ప్రభుత్వ సంస్థలతో సహా HODలతో సంబంధం లేకుండా తొలగించాలని ఆదేశించారు.

Read Also : Atal Canteens : ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో రూ.5కే భోజనం.. ‘అటల్ క్యాంటీన్లు’ ఏంటి? ఫుల్ డిటెయిల్స్..!

ఈ రిటైర్డ్ అధికారులు ఇప్పటికీ అవసరమయ్యే విభాగాలు సంబంధిత అధికారి నుంచి తాజా ఉత్తర్వులను పొందవలసి ఉంటుంది. ఈ విషయంలో, డిప్యుటేషన్‌పై లేదా కాంట్రాక్ట్ లేదా సోర్సింగ్ ప్రాతిపదికన నియమించిన 177 మంది అధికారులను సర్వీసుల నుంచి తొలగించారు.

వీరిలో హెచ్ఎండీఏలో పనిచేస్తున్న 63 మంది రిటైర్డ్ అధికారులు, జీహెచ్ఎంసీ నుంచి 45 మంది ఉన్నారు. ఇప్పటికీ రిటైర్డ్ అధికారులు లేదా ఉద్యోగుల సర్వీసులు అవసరమయ్యే విభాగాలు సంబంధిత అధికారి నుంచి అనుమతిని పొందాల్సి ఉంటుంది.