Traffic echallan: పెండింగ్ చలాన్లపై బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ల వివరాలు ఇవిగో..
ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90శాతం రాయితీ.. టూవీలర్స్‌పై 80 శాతం రాయితీ.. ఇలా కట్టేయండి..

Traffic Challan
Telangana Police: పెండింగ్ చలాన్లపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పెండింగ్ చలాన్లపై పోలీసులు రాయితీ ప్రకటించారు. పెండింగ్ చలాన్లను డిసెంబరు 26 తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా ఫైన్లు కట్టవచ్చు. తెలంగాణలోని వాహనాలపై చలాన్ల పెండింగ్ లు భారీగా ఉన్నాయి.
గతంలోనూ సర్కారు పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించిన సమయంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పుడు మరోసారి అటువంటి నిర్ణయమే తీసుకుంది ప్రభుత్వం. ఆన్‌లైన్‌తో పాటు మీ-సేవ సెంటర్లలో డిస్కౌంట్లో చలాన్లు కట్టవచ్చు. 2022లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రూ.300 కోట్ల చలాన్లు వసూలయ్యాయి.
డిస్కౌంట్లు ఇలా..
- ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90శాతం రాయితీ
- టూవీలర్స్‌పై 80 శాతం రాయితీ
- ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్
- భారీ వాహనాలపై 50 శాతం రాయితీ
- https://echallan.tspolice.gov.in/publicview/ లో మీ వాహనంపై ఉన్న చలాన్ల వివరాలు చూసుకోండి
Hyderabad: ఖాజాగూడ చెరువు రోడ్డు వద్ద బోల్తా పడ్డ కారు.. ఒకరి మృతి