Residential Housing Prices : హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ప్రియం.. అసలు రీజన్ ఏంటంటే?
Residential Housing Prices : హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల ధరలు ఉన్నట్టుండి ప్రియంగా మారడానికి చాలా కారణాలే ఉన్నాయి.

Hyderabad Second Most Expensive Residential Realty Market In India During Jan Mar 2021 Last Year
Residential Housing Prices : హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల ధరలు ఉన్నట్టుండి ప్రియంగా మారడానికి చాలా కారణాలే ఉన్నాయి. నగరంలో రియల్ మార్కెట్లో జనవరి–మార్చి మధ్యలో ఇళ్ల ధరలు ఒక్కసారిగా 9 శాతం వరకు పెరిగాయి. ఒక చదరపు అడుగు ధర రూ.9,232కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై తర్వాత చదరపు అడుగు ధర హైదరాబాద్‌లోనే పెరిగింది. దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య సగటున 11శాతం మేర పెరిగాయని నివేదిక వెల్లడించింది. క్రెడాయ్, కొలియర్స్, లయసెస్ ఫొరాస్ ఈ వివరాలను నివేదికగా అందించాయి. ఇళ్ల ధరల డిమాండ్ పెరగడమే కాకుండా.. నిర్మాణరంగంలో అవసరమయ్యే ముడి సరుకుల ధరలు కూడా పెరగడం ఇళ్ల ధరలు మరింత ప్రియంగా మారడానికి కారణాలని నివేదిక వెల్లడించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఇళ్ల ధరలు గత జనవరి–మార్చి (2021 జనవరి–మార్చి)తో పోలిస్తే అత్యధికంగా 11 శాతం పెరిగాయి. ఒక చదరపు అడుగు ధర రూ.7,363కు వరకు పెరిగింది. అహ్మదాబాద్‌లో ధరలు 8శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.5,721కి చేరాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, చెన్నైలో ఇళ్ల ధరలు ఒక శాతమే వృద్ధిని సాధించాయి. చదరపు అడుగు ధర బెంగళూరులో రూ.7,595గా ఉంటే.. చెన్నైలో రూ.7,017, ముంబైలో రూ. 19,557గా ఉంది. పుణె మార్కెట్లో ధరలు 3శాతం మేర పెరిగాయి.

Hyderabad Second Most Expensive Residential Realty Market In India During Jan Mar 2021 Last Year
చదరపు అడుగు ధర రూ.7,485గా ఉంది. చాలా నగరాల్లో ఇళ్ల కొనుగోలుకు భారీ డిమాండ్ పెరిగింది. రెండేళ్లలో ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్స్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. దీని కారణంగానే వార్షికంగా ఇళ్ల ధరలు పెరగడానికి దారితీశాయి. తద్వారా 8 ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు కరోనాకు మునుపటి కన్నా స్థాయిని మించాయని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్యలో సగటున 4 శాతం పెరిగాయని క్రెడాయ్, కొలియర్స్ నివేదిక తెలిపింది.
వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఇళ్ల ధరలు 5నుంచి 10 శాతం మధ్య పెరిగే అవకాశం ఉందని కొలియర్స్ ఇండియా సీఈవో రమేశ్ నాయర్ అంచనా వేశారు. భారత నివాస మార్కెట్ ఆశించిన స్థాయిలో ఉందని అన్నారు. దీర్ఘకాలం తర్వాత మార్కెట్ అంచనాలను దాటిందన్నారు.
Read Also : Houses Rates : హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు