పవన్ సజీవదహనం కేసు.. పక్కా ప్లాన్ ప్రకారం భార్యే చంపింది

  • Published By: naveen ,Published On : November 26, 2020 / 11:40 AM IST
పవన్ సజీవదహనం కేసు.. పక్కా ప్లాన్ ప్రకారం భార్యే చంపింది

Updated On : November 26, 2020 / 11:54 AM IST

Hyderabad techie burnt alive: అదే నిజమైంది. పవన్‌ కుటుంబసభ్యుల ఆరోపణలు వాస్తవమని తేలాయి. పక్కా ప్లాన్‌ ప్రకారం కుటుంబసభ్యులతో కలిసి భార్యే…భర్తను సజీవదహనం చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె వేసిన ప్లాన్‌ బెడిసికొట్టి అడ్డంగా బుక్కైంది. మరి భర్తను చంపాల్సిన అవసరం ఆమెకు ఎందుకొచ్చింది..? బావమరిది మరణానికి అతడే కారణమా..? అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది..?

పథకం ప్రకారమే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య.. సజీవదహనం వెనుక పవన్‌ భార్య కృష్ణవేణి.. కుటుంబసభ్యులతో కలిసి భర్తను చంపిన భార్య.. కృష్ణవేణి సహా ఏడుగురిపై కేసులు నమోదు..హత్య కేసులో ఐదుగురు మహిళా నిందితులు.. పవన్‌ హత్యలో మరికొంతమంది ప్రమేయం.