హైదరాబాద్ వాసులకు బిగ్‌అలర్ట్.. మరో నాలుగు రోజులు దంచికొట్టనున్న వానలు.. అధికార యంత్రాంగానికి సీఎం కీలక ఆదేశాలు.. నేడు ఆ ప్రాంతాల్లో వర్షం..

హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నాలుగు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు

హైదరాబాద్ వాసులకు బిగ్‌అలర్ట్.. మరో నాలుగు రోజులు దంచికొట్టనున్న వానలు.. అధికార యంత్రాంగానికి సీఎం కీలక ఆదేశాలు.. నేడు ఆ ప్రాంతాల్లో వర్షం..

Hyderabad Rains

Updated On : August 5, 2025 / 9:27 AM IST

Hyderabad Rains: రాజధాని హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. సుమారు రెండు గంటలపాటు ఏకదాటిగా కురిసిన భారీవర్షంతో రహదారులన్నీ వరద నీటి కాలువల్లా మారిపోయాయి. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, మరో నాలుగు రోజుల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నగరంలోని అన్ని జోన్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read: తెలంగాణలోని రైతులకు గుడ్‌న్యూస్.. వారందరికీ రైతు బీమా.. ఈ ఫస్ట్‌వీక్‌లోగా అప్లయ్ చేసుకునే వెసులుబాటు..

సోమవారం మధ్యాహ్నం 3.40గంటలకు మొదలైన వర్షం రాత్రి 6గంటల వరకు కుండపోతగా కురిసింది. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 15.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జూబ్లీహిల్స్ లో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లపై నడుములోతునీరు పారింది. కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. రాత్రి 8గంటల వరకు రోడ్లపై వాహనాలు ముందు కదలలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.


హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నాలుగు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షం పలు ప్రాంతాల్లో భారీ వర్షం. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని, వరద నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయనే సమాచారం ఉందని, ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు రానివ్వద్దని ఆదేశించారు.