డబుల్ డెక్కర్ బస్సులు : జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, కేటీఆర్ ట్వీట్

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 02:27 PM IST
డబుల్ డెక్కర్ బస్సులు : జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, కేటీఆర్ ట్వీట్

Updated On : November 7, 2020 / 3:00 PM IST

I have many fond memories of riding the double decker bus :  తాను ఆబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుకొనే సమయంలో ఆ దారిగుండా..వెళుతున్న సమయంలో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని ఆనాటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు మంత్రి కేటీఆర్. మరి హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉందా ? అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశించి అడిగారు.



2020, నవంబర్ 07వ తేదీ శనివారం ఉదయం షాకిర్ హుస్సేన్ అనే నెటిజన్ ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేయడంతో డబుల్ డెక్కర్ బస్సులపై చర్చ స్టార్ట్ అయ్యింది. ఒకప్పుడు జూ పార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్ గంజ్, ఆబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్ వరకు డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవంటూ..ఓ ఫొటో జత చేశారు.



https://10tv.in/karnataka-riding-without-a-helmet-your-driving-license-will-be-suspended/
ఇప్పుడు మళ్లీ ఇలాంటి బస్సులు ప్రయాణీకులకు లేదా టూరిస్టుల కోసం తీసుకరావాలని కోరుతూ..కేటీఆర్ కోరుతూ ట్వీట్ చేశారు.
దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..పై విధంగా ట్వీట్ చేశారు. అయితే..ఆ బస్సులను ఎందుకు ఆపేశారో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. డబుల్ డెక్కర్ తీసుకొచ్చే దానిపై సాధ్యసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్ సూచించారు.