PM Modi : కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్‌కు కార్బన్ పేపర్ లాంటి సర్కారే వస్తుంది : ప్రధాని మోదీ

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయలేని పేర్కొన్నారు. ప్రాజెక్టులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు జేబులు నింపుకుంటారని ఆరోపించారు.

PM Modi : కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్‌కు కార్బన్ పేపర్ లాంటి సర్కారే వస్తుంది : ప్రధాని మోదీ

PM Modi (2)

Updated On : November 25, 2023 / 6:40 PM IST

PM Modi Comments Congress -BRS : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీకి కార్బన్ పేపర్ లాంటి సర్కారే వస్తుందన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే ప్రారంభమైందన్నారు. కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని, గతంలో కాంగ్రెస్‌తో పొత్తు కూడా పెట్టుకున్నారని గుర్తు చేశారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించిన ప్రచార సభలో పీఎం పాల్గొని, ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ బొరుసు లాంటివని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇక్కడి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారని తెలిపారు. బీజేపీ అంటే కేసీఆర్ కు భయమని పేర్కొన్నారు. హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీలో బీజేపీ గెలిచిందన్నారు.

Also Read : తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ : యోగి ఆదిత్యనాథ్

తెలంగాణ అభివృద్ధి మోదీ సంకల్పం అని ప్రజలు తాను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమాజానికి విరోధ పార్టీలని విమర్శించారు. బీసీ నేత సీతారాం కేసరిని కాంగ్రెస్ పార్టీ అవమానించినట్లు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసనీయమైన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. దశాబ్దాల నుంచి బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనీ సీఎం చేస్తామని చెప్పారు.

ఎస్సీ వర్గీకరణపై అధికారులతో శుక్రవారం భేటీ అయ్యానని, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తయారు చేయమని అధికారులకు చెప్పానని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ తగ్గించలేదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయలేని పేర్కొన్నారు. ప్రాజెక్టులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు జేబులు నింపుకుంటారని ఆరోపించారు.