Illegal Relationship: మరో వ్యక్తితో భార్య.. చెప్పిన వినకపోవడంతో..
వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను హతమార్చాడు భర్త.. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మ బండలో చోటుచేసుకుంది.

Illegal Relationship
Illegal Relationship: వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను హతమార్చాడు భర్త.. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మ బండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ గ్రామానికి చెందిన సువర్ణ (32), రాజు పదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. బ్రతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం వారి ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే చిన్నాచితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
గత కొంత కాలంగా వీరిద్దరూ ఒకే మేస్త్రీ వద్దకు పనికి వెళ్తున్నారు. సువర్ణ అక్కడ ఓ వ్యక్తితో చనువుగా ఉంటుండటంతో భర్త రాజుకు అనుమానం వచ్చింది. అనేక సార్లు అతడితో మాట్లాడొద్దని సువర్ణను హెచ్చరించాడు రాజు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇదే విషయమై ఇరువురికి గొడవ జరిగింది.
తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజు పార కర్రతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని భర్త రాజును అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.