చేతిలో కర్రలతో వాహనాల తనిఖీలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల తీరుపై పోలీసులు సీరియస్
కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో
కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో
కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో రోడ్డుపైకి వచ్చే వాహనదారులను ఆపుతున్నారు. ఎందుకు రోడ్డుపైకి వచ్చారో తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు ఆ పని చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల చెక్ పోస్టుల దగ్గర ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కనిపించారు. వారి చేతిలో లాఠీలు ఉన్నాయి. చెక్ పోస్టుల దగ్గర కాపు కాసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాహనదారులను ఆపుతున్నారు.
లాక్ డౌన్ సమయంలో బయటకు ఎందుకొచ్చారని అడుగుతున్నారు. అంతేకాదు వాహనాలను తనిఖీ కూడా చేస్తున్నారు. వారి దగ్గరున్న డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేస్తున్న ఈ పని వివాదానికి దారితీసింది. దీనిపై వాహనదారులు అభ్యంతరాలు తెలిపారు. అసలు చెక్ పోస్టుల దగ్గర నిలబడేందుకు, వాహనాలు తనిఖీ చేసేందుకు వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని అడుగుతున్నారు. దీనిపై కొందరు వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు స్పందించారు. పోలీసులు చేయాల్సిన పనులను ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. వారంతట వారే వాహనాలు తనిఖీ చేసినట్లు గుర్తించామన్నారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులకు సాయం చేస్తామంటూ అనుమతి అడిగితే ఆర్ఎస్ఎస్ వారి సాయం అక్కర్లేదని వెనక్కి తిప్పి పంపినట్లు చెప్పారు. అయినా వారి వినిపించుకోకుండా తర్వాతి రోజు రోడ్డుపై వాహనాలు ఆపినట్లు తమ దృష్టికి వచ్చిందని, కొన్ని ఫొటోలను గుర్తించామని సీపీ వివరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. వాహనాలు ఆపే అధికారం కానీ డాక్యుమెంట్స్ చెక్ చేసే అధికారం కానీ ఆర్ఎస్ఎస్ వాలంటీర్లకు లేదన్నారు సీపీ మహేష్ భగవత్.
”కాగా, ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు పోలీసులకు సాయం చేస్తున్నారు. 12గంటల పాటు వారికి సాయం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చెక్ పోస్టు దగ్గర ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు వాహనాలు ఆపి తనిఖీలు చేశారు” అని ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అనే పేరుతో ట్విట్టర్ లో ఒక ఫొటో ట్వీట్ చేశారు. ఇప్పుడీ ఫొటో వివాదానికి దారితీసింది. వాహనదారులు పోలీసులపై మండిపడుతున్నారు. వాహనాలు ఆపేందుకు, డాక్యుమెంట్స్ తనిఖీ చేయడానికి వారికి పర్మిషన్ ఇచ్చారా? అని పోలీసులను అడుగుతున్నారు. వివాదం పెద్దది కావడంతో పోలీసులు స్పందించారు. వారికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.
RSS volunteers helping the police department daily for 12 hours at Yadadri Bhuvanagiri district checkpost, Telangana. #RSSinAction pic.twitter.com/WjE2pcgpSy
— Friends of RSS (@friendsofrss) April 9, 2020
