New Secretariat Postponed : తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. మొదట ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సచివాలయ ప్రారంభోత్స కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

new secretariat
New Secretariat Postponed : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. మొదట ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సచివాలయ ప్రారంభోత్స కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. నూతన సచివాలయాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనేది త్వరలో అధికారులు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన షెడ్యూల్ ఈసీ ప్రకటించింది. అదే విధంగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 13న ఎన్నికలు జరుగన్నాయి. మార్చి 16న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నూతన సచివాలయ ప్రారంభోత్స తేదీని ఈసీకి
రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అయితే నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ఈసీని అనుమతి కోరింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 17న ప్రారంభం కావాల్సిన నూతన సచివాలయాన్ని వాయిదా వే స్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నారు. మార్చి 16తేదీ తర్వాత కొత్త సచివాలయ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.