Gun Fire: అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో యువకుడు మృతిచెందాడు.

United States
Gun Fire: అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో యువకుడు మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్ కు చెందిన రవితేజగా గుర్తించారు. చైతన్యపురి పీఎస్ పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ కుటుంబం నివాసం ఉంటుంది.
రవితేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. మాస్టర్స్ పూర్తిచేసిన తరువాత ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అమెరికాలోని వాషింగ్టన్ లో దుండగులు కాల్పులు జరిపారు. రవితేజ మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆర్కేపురంలో విషాదచాయలు అలముకున్నాయి.