Indiramma Indlu: ఇటుక పెట్టకుండా 15రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి.. కేవలం ప్రభుత్వం ఇచ్చే 5లక్షలతోనే.. ఎలా సాధ్యం..

రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారుల పర్యవేక్షణలో నాలుగు మోడల్ హౌస్ ల నిర్మాణాన్ని కంపెనీ పూర్తి చేసింది.

Indiramma Indlu: ఇటుక పెట్టకుండా 15రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి.. కేవలం ప్రభుత్వం ఇచ్చే 5లక్షలతోనే.. ఎలా సాధ్యం..

Indiramma house

Updated On : May 9, 2025 / 9:26 AM IST

Indiramma Indlu: రాష్ట్రంలోని ఇల్లులేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే తొలి విడత 71వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా.. ఇందులో 65వేల మంది అర్హులుగా తేలారు. వీరిలో 3వేల మంది లబ్ధిదారులు బేస్ మెంట్ పూర్తి చేయగా.. మరో 20వేల మంది ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేశారు.

 

మరోవైపు రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. ఈ పథకం కింద ప్రభుత్వం దశల వారిగా రూ.5లక్షలు నగదు అందజేస్తుంది. అయితే, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే నిర్మించుకోవాలని ప్రభుత్వ షరతు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముకంటే ఇంటి నిర్మాణంకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు వెనుకాడుతున్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల్లోనే ఇంటి నిర్మాణం పూర్తిచేసేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది.

 

కేవలం ఆరుగురు వర్కర్ల సాయంతో, 75చదరపు గజాల్లో ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల్లోనే 15రోజుల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు ఓ ప్రైవేట్ కంపెనీ ముందుకొచ్చింది. అంతేకాదు.. షేర్ వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుక వాడకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్ వర్క్, కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని హౌసింగ్ డిపార్ట్ మెంట్ పర్యవేక్షలో ఆ సంస్థ నిర్మించింది. ఇలా నాలుగు మోడల్ హౌస్ ల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసింది.

 

రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారుల పర్యవేక్షణలో నాలుగు మోడల్ హౌస్ ల నిర్మాణాన్ని కంపెనీ పూర్తి చేసింది. ఆరుగురు కార్మికులు రోజుకు 16గంటలు పనిచేసి ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఇంటి నిర్మాణాలకు లైఫ్ టైం 30ఏండ్లుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆయా చోట్ల పూర్తయిన ఇండ్లను త్వరలో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు హౌసింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఈ అధునాత షేర్ వెల్ టెక్నాలజీతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లలో 400 ఎస్ఎఫ్టీతో బెడ్ రూమ్, కిచెన్, హాల్, రెండు బాత్ రూమ్స్ తో 75గజాల జాగలో నిర్మిస్తున్నారు. 400 ఎస్ఎఫ్టీ నుంచి 600 ఎస్ఎఫ్టీ వరకు నిర్మించుకోవచ్చని, ఇందుకు మరికొంత ఎక్కు ఖర్చు అవుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం తాము 400 ఎస్ఎఫ్టీతో మోడల్ హౌస్ నిర్మించామని, ఈ ఇంటిలో కూడా సెల్ప్ లు, డాబా మీదకు వెళ్లేందుకు మెట్లు నిర్మించేందుకు కూడా అయ్యే ఖర్చును త్వరలో ఖరారు చేస్తామని, లబ్ధిదారులు అంగీకరిస్తే వారికి నచ్చిన విధంగా నిర్మించి ఇస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.