TS Intermediate : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు.. 15 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించండి
ఆదివారం నుంచి ఆన్ లైన్ లో ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించవచ్చని, ఆ తర్వాత లోపలికి రాని

Ts Inter
Inter Practical Tests : ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు త్వరలోనే జరుగనున్నాయి. ఈనెల 23వ తేదీ నుంచి ఏప్రిల్ 09వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయనే సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి ఆన్ లైన్ లో ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. పరీక్షలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. పరీక్షలకు సంబంధించి సమయం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించవచ్చని, ఆ తర్వాత లోపలికి రానివ్వొద్దని ఇంటర్ బోర్డు కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది.
Read More : AP Inter Exams Dates : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
ఈ మేరకు బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీ చేశారు. కళాశాలల్లో రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 02 గంటల నుంచి 05 గంటల వరకు ప్రయోగ పరీక్షలు జరుగనున్నాయి. ఎగ్జామినర్లుగా నియమించిన అధ్యాపకులను విధుల నుంచి రిలీజ్ చేయాలని, లేనిపక్షంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు/యాజమాన్యాలకు రూ. 5 వేల వరకు ఫైన్ విధించడం జరుగుతుందని బోర్డు కార్యదర్శి జలీల్ హెచ్చరించారు. విద్యార్థులకు వేసిన మార్కులను అదే రోజు రాత్రి 08 గంటలలోపు ఆన్ లైన్ లో బోర్డుకు పంపాలని, జాగ్రఫీ విద్యార్థులకు ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రయోగ పరీక్షలు జరుగుతాయన్నారు.