కాంగ్రెస్ సర్కార్ రివెంజ్ పాలిటిక్స్ చేస్తోందా? బీసీలకు కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీ ఏంటి? వీకెండ్ విత్ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్..
ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చిందనే ప్రచారంపై ఆయన ఏం చేయనున్నారు? పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లనున్నారు?

Weekend With Mahesh Kumar Goud : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు మహేశ్ కుమార్ గౌడ్. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని రెండు నెలలు కావొస్తోంది. సమన్వయ యాత్రల పేరుతో ఆయన జిల్లాల పర్యటనకు బయలుదేరబోతున్నారు. గాంధీభవన్ లో ఇప్పటికే మంత్రులంతా వచ్చి ప్రతి వారం అర్జీలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటు ప్రభుత్వం, ఇటు పార్టీ.. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోందని చెప్పొచ్చు.
మరి ఈ రెండు నెలల కాలంలో.. పీసీసీ చీఫ్ గా చేయడం ఎలా ఉంది? మహేశ్ కుమార్ గౌడ్ చేసిన కార్యక్రమాలు ఏంటి? పార్టీలో క్రమశిక్షణ ఎలా ఉంది? పార్టీ నాయకులతో సమన్వయం ఏ విధంగా ఉంది? పీసీసీ చీఫ్ గా భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చిందనే ప్రచారంపై ఆయన ఏం చేయనున్నారు? పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లనున్నారు? కాంగ్రెస్ సర్కార్ రివెంజ్ పాలిటిక్స్ చేస్తోందా? బీసీలకు కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీ ఏంటి? ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ వారేనా? వీకెండ్ ఇంటర్వ్యూ విత్ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్..
Also Read : బీఆర్ఎస్ నయా ప్లాన్..! ఆ వర్గానికి దగ్గరయ్యేలా ప్రణాళిక..