అలాగైతే సబ్ కమిటీ ఏర్పాటు ఎందుకు?: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

Jagadish Reddy: మార్నింగ్ వాక్ చేస్తే చైన్ స్నాచర్లు, సాయంత్రం వేళ మహిళలపై వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయని అన్నారు.

Jagadish Reddy

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతు బంధును బంద్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ రైతు భరోసా ప్రారంభిస్తే మరి సబ్ కమిటి ఎందుకని నిలదీశారు.

రైతు బంధు ఇప్పటి వరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీతో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్‌ది మోసపూరిత, అబద్ధాల ప్రభుత్వమని చెప్పారు. తెలంగాణలో శాంతి భద్రతలు లేకుండాపోతున్నాయని విమర్శించారు. మార్నింగ్ వాక్ చేస్తే చైన్ స్నాచర్లు, సాయంత్రం వేళ మహిళలపై వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు మానేసి పాలనపై దృష్టి పెట్టాలని చెప్పారు. విచారణకు సంబంధించి జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ తన అభిప్రాయాన్ని కూడా అడిగిందని, ఏడు రోజులు గడువు ఇచ్చిందని తెలిపారు. తనకు ఉన్న మొత్తం సమాచారాన్ని ఇస్తానని చెప్పారు. కేసీఆర్‌ను విచారణకు పిలిచినట్లే, అప్పటి ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ ను విచారించాలని అన్నారు.

పరిపాలన, ప్రజాసేవపై బాబు, పవన్ ఫోకస్.. ఏం చేస్తున్నారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు