#JanaSenaTelangana: తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధం… పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కసరత్తులు షురూ

తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 32 నియోజకవర్గాల్లో నూతన కార్య నిర్వాహకుల నియామకం జరిగిందని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన కమిటీల ఏర్పాటులో కొత్త వారికి అవకాశం కల్పించినట్లు వివరించింది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన సూచన మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ చెప్పారు.

#JanaSenaTelangana: తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధం… పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కసరత్తులు షురూ

Updated On : December 11, 2022 / 5:56 PM IST

#JanaSenaTelangana: తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 32 నియోజకవర్గాల్లో నూతన కార్య నిర్వాహకుల నియామకం జరిగిందని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన కమిటీల ఏర్పాటులో కొత్త వారికి అవకాశం కల్పించినట్లు వివరించింది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన సూచన మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ చెప్పారు.

జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పనిచేసిన వారికి అధికంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మొదటి దశలో 32 మందిని కార్యనిర్వాహకులుగా నియమించినట్లు తెలిపారు. వారి పేర్లను జనసేన పార్టీ ప్రకటించింది. కాగా, ఎన్నికల ప్రచారానికిపవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం ‘వారాహి’ పేరుతో వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు.

గత ఏపీ ఎన్నికల ముందు పవన్ తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సారీ ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించనున్నట్లు సమాచారం. అనుష్టు నారసింహ యాత్ర పేరుతో ఏపీతో పాటు తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ పర్యటిస్తారని తెలుస్తోంది. కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభిద్దామని తెలంగాణలోని తమ కార్యకర్తలకు పవన్ కల్యాణ్ ఇటీవల చెప్పారు.

Delhi liquor scam: 6 గంటలుగా కవిత వివరణ తీసుకుంటున్న సీబీఐ అధికారులు.. భారీగా పోలీసు బందోబస్తు