Delhi liquor scam: 6 గంటలుగా కవిత వివరణ తీసుకుంటున్న సీబీఐ అధికారులు.. భారీగా పోలీసు బందోబస్తు

దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఆరు గంటలుగా విచారిస్తున్నారు. ఆమె నుంచి అన్ని వివరాలు రాబడుతున్నారు. ఇవాళ సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో హైదరాబాద్ లోని కవిత ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ అధికారుల బృందంలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు.

Delhi liquor scam: 6 గంటలుగా కవిత వివరణ తీసుకుంటున్న సీబీఐ అధికారులు.. భారీగా పోలీసు బందోబస్తు

Delhi liquor scam: దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఆరు గంటలుగా విచారిస్తున్నారు. ఆమె నుంచి అన్ని వివరాలు రాబడుతున్నారు. ఇవాళ సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో హైదరాబాద్ లోని కవిత ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ అధికారుల బృందంలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు.

సీఆర్పీసీ 161 కింద కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటామని సీబీఐ అధికారులు చెప్పారు. కవిత ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ సమయంలో కవితకు టీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు. అయితే, ఇవాళ తన ఇంటికి రావదద్దని ఆమె కార్యకర్తలకు చెప్పారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ఇప్పటికే కవిత న్యాయ నిపుణులతో చర్చించారు. అలాగే, తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ ఆమె పలుసార్లు మాట్లాడారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన వ్యాపారవేత్త అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. రిమాండు రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారి పేర్లను పేర్కొంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై అమిత్ అరోరాని ఈడీ ఇటీవల అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్లుగా శరత్ చంద్రతో పాటు కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈడీ తెలిపింది.

Chittoor Auto Driver Murder : ప్రియుడితో భార్యే హత్య చేయించింది.. ఆటో డ్రైవర్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ