కాంగ్రెస్‌ విజయాన్ని అడ్డుకునేందుకు బీఅర్ఎస్, బీజేపీ చేతులు కలిపాయి : జీవన్ రెడ్డి

స్మార్ట్ సిటీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేంద్రం నిజామాబాద్ కు ఆ హోదా ఇవ్వకపోవడం దారుణం . రానున్నరోజుల్లో నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జీవన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ విజయాన్ని అడ్డుకునేందుకు బీఅర్ఎస్, బీజేపీ చేతులు కలిపాయి : జీవన్ రెడ్డి

Jeevan Reddy

Jeevan Reddy : లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, కాంగ్రెస్ గెలబోతుందని, కార్యకర్తల కష్టమే కారణమని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈ పార్లమెంట్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింతగా పెంచిందని చెప్పారు. కాంగ్రెస్ విజయంకోసం కార్యకర్తలు విశేషంగా కృషిచేశారని జీవన్ రెడ్డి కొనియాడారు. కేవలం రాజకీయ లబ్ధికోసం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నీచానికి ఒడిగట్టాయి, కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఆ రెండు పార్టీల నేతలు చేతులు కలిపారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

Also Read : Kashi Toll Plaza : టోల్ ఫీజు అడిగినందుకు మహిళను కారుతో ఢీకొట్టాడు.. వీడియో వైరల్

నిజామాబాద్ మత సామరస్యానికి ప్రతీక. అందుకే రెచ్చగొట్టే చర్యలకు ఓటర్లు ఎక్కడా ప్రభావితం కాలేదని జీవన్ రెడ్డి అన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను ప్రజలు బలంగా నమ్మారు. స్మార్ట్ సిటీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేంద్రం నిజామాబాద్ కు ఆ హోదా ఇవ్వకపోవడం దారుణం . రానున్నరోజుల్లో నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Also Read : దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంటులో ఆశించిన స్థాయిలో ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాకు వరం అన్నారు. ప్రభుత్వ ఆరు గ్యారెంటీ లు ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చాలా చోట్ల బీఅర్ఎస్, బీజేపీ కుమ్మక్కై క్రాస్ ఓటింగ్ చేశారు. అయినా లక్ష 50వేల ఓట్ల మెజారిటీ తో గెలువబోతున్నాం. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నామని చెప్పారు.