Kashi Toll Plaza : టోల్ ఫీజు అడిగినందుకు మహిళను కారుతో ఢీకొట్టాడు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ లోని ఢిల్లీ - మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ టోల్ ఫీజు అడిగినందుకు ..

Kashi Toll Plaza : టోల్ ఫీజు అడిగినందుకు మహిళను కారుతో ఢీకొట్టాడు.. వీడియో వైరల్

Kashi toll plaza

Updated On : May 14, 2024 / 1:09 PM IST

Uttar Pradesh Kashi Toll Plaza : ఉత్తరప్రదేశ్ లోని ఢిల్లీ – మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ టోల్ ఫీజు అడిగినందుకు మహిళా టోల్ ఉద్యోగిని కారుతో ఢీకొట్టాడు. సదరు ఉద్యోగికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : 100 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి.. పోలీసులకు చిక్కాడు

ఘటనకు సంబంధించి కాశీ టోల్ ప్లాజా మేనేజర్ అనిల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రూ. 160తో ప్రాణహాని ఉండటం బాధాకరమన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కారులో ముగ్గురు, నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఫాస్టాగ్ లేకుండా రావడంతో టోల్ ఫీజు చెల్లించాలని మా సిబ్బంది అడిగారు. దీంతో కారులోని వారు మహిళా సిబ్బందితో వాగ్వివాదానికి దిగి, అనుచితంగా ప్రవర్తించారు. టోల్ ఫీజు గట్టిగా అడిగినందుకు కారు ముందు ఉన్న మా సిబ్బందిని కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనలో మహిళా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని టోల్ ప్లాజా మేనేజర్ చెప్పారు.

Also Read : Sushil Kumar Modi : బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ క‌న్నుమూత‌

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని టోల్ ప్లాజా సిబ్బంది కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలాఉంటే.. టోల్ ప్లాజా సిబ్బంది కారు డ్రైవర్ పై సమీపంలోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కారుకోసం గాలిస్తున్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు.