Sushil Kumar Modi : బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ క‌న్నుమూత‌

బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ మోదీ క‌న్నుమూశారు.

Sushil Kumar Modi : బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ క‌న్నుమూత‌

Sushil Kumar Modi

Updated On : May 14, 2024 / 11:16 AM IST

Sushil Modi Dies : బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ మోదీ క‌న్నుమూశారు. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(ఏయిమ్స్‌)లో చికిత్స పొందుతూ సోమ‌వారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 72 సంవ‌త్స‌రాలు. త‌న‌కు క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు నిర్థార‌ణ అయ్యింద‌ని, అందుకునే ఈ సారి లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌డం లేద‌ని గ‌త నెల‌లో ఆయ‌న తెలిపారు.

సుశీల్ కుమార్ మోదీ మ‌ర‌ణం ప‌ట్ల బీజేపీ తీవ్ర విచారం వ్య‌క్తం చేసింది. సంతాపం తెలుపుతూ పార్టీ రాష్ట్ర యూనిట్ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. సునీల్ మ‌ర‌ణ వార్త‌తో బీజేపీ కుటుంబం తీవ్ర విచారంలో ఉంద‌ని, ఆయ‌న మృతి బీహార్‌తో పాటు బీజేపీ కుటుంబానికి తీర‌ని లోటు అని తెలిపింది.

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం.. హాజరైన రాజకీయ ప్రముఖులు

సుశీల్ మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర విచారం వ్యక్తం చేశారు. ‘సుశీల్ మోదీ జీ అకాల మరణం చాలా బాధ క‌లిగించింది. పార్టీలో నా విలువైన సహచరుడు. దశాబ్దాలుగా నా మిత్రుడు. బీహార్‌లో బీజేపీ ఎదుగుదల, విజయంలో ఆయన ఎనలేని పాత్ర పోషించారు.’ అని ప‌ధాని ట్వీట్ చేశారు.

సుశీల్‌ మోదీ మృతి రాష్ట్రానికి తీరని లోటని ఆయనకి అత్యంత సన్నిహితుడైన బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

ముంబై ఘాట్‌కోప‌ర్‌లో హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

కాగా.. నేడు (మంగ‌ళ‌వారం) పాట్నాలోని ఆయ‌న నివాసంలో అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబ‌ స‌భ్యులు తెలిపారు.