JetSetGo: రూ.12కే విమానయానం, పైలట్ లేకుండానే ప్రయాణం

ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్ల ఆపరేటింగ్ ఆపరేటర్ జెట్‌సెట్‌గో మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సేవలు విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వృద్ధి చేయాలని ప్రణాళికలు

JetSetGo: రూ.12కే విమానయానం, పైలట్ లేకుండానే ప్రయాణం

Jetsetgo

Updated On : March 25, 2022 / 12:11 PM IST

JetSetGo: ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్ల ఆపరేటింగ్ ఆపరేటర్ జెట్‌సెట్‌గో మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సేవలు విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ 28 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నాలుగు హెలికాప్టర్లతో ఆపరేటింగ్ చేస్తుంది. వీటితో పాటు అదనంగా మరో ఆరు ఎయిర్‌క్రాఫ్ట్‌లు తీసుకుంటుండగా నాలిగింటిని హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేస్తున్నారు.

వింగ్స్ ఇండియా ప్రదర్శనలో భాగంగా 600VT-SFU, Hawker XP 800 VT-POPల గురించి చెప్తూ.. జెట్‌సెట్‌గో ఫౌండర్, సీఈఓ కనికా తేక్రీవాల్ రెడ్డి ఇలా మాట్లాడారు.

‘మా దగ్గర 30 విభిన్నమైన జెట్స్, హెలికాప్టర్లు ఉన్నాయి. ఇంకా కార్పొరేట్స్, మెడికల్, గవర్నమెంట్ రంగాలకు చెందిన కస్టమర్లు ఉన్నారు. గతేడాదిలోనే 7విమానాలను దిగుమతి చేసుకున్నాం. ప్రస్తుతం మరో ఆరు దిగుమతి చేసుకోవాలనుకుంటున్నాం’ అని అన్నారు.

Read Also : గుజరాత్ లో తొలి ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్

అరబిందో ఫార్మా డైరక్టర్ పీ శరత్ చంద్రా రెడ్డిని వివాహమాడిన కనికా.. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి కొత్తగా దిగుమతి చేసుకున్న నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మూడు నెలల్లోగా మరో 200 మిలియన్ డాలర్లతో వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, దాల్మియా గ్రూప్ కు చెందిన పునీత్ దాల్మియాలు సంయుక్తంగా పెట్టుబడులు పెట్టనున్నారట.

కొవిడ్ ప్రభావంతో చాలా మంది కస్టమర్లు ప్రైవేట్ జెట్స్ ఉపయోగించి హైదరాబాద్ టూ తిరుపతి వెళ్లేవారు. అలా రోజుకు నాలుగు ట్రిప్ లు వేసేవాళ్లం. అంతేకాకుండా రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కూడా మన విమానాలు తిరుగుతుండేవని ఆమె స్పష్టం చేశారు.

‘ప్రస్తుతం జెట్‌‌సెట్‌‌గో వద్ద 22 జెట్స్, 2 హెలికాప్టర్స్‌ ఉన్నాయి. 80 మంది పైలట్లు ఉన్నారు. కొత్తగా ఈ ఏడాది నాలుగు జెట్స్, ఒక హెలికాప్టర్‌ జతకూడనున్నాయి. అద్దె గంటకు రూ.1.3 లక్షల నుంచి ప్రారంభం అవుతుందట. 120 దేశాల్లో 600లకుపైగా విమానాశ్రయాల్లో అడుగుపెట్టాం. రోజుకు సగటున 75 ల్యాండింగ్స్‌ జరుగుతున్నాయి. రెండు నెలల్లో రూ.1,520 కోట్లు సమీకరిస్తున్నాం’ అని ఆమె అన్నారు.

Read Also: గంటకు 623కిలోమీటర్ల వేగంతో ఎలక్ట్రిక్ రోల్స్-రాయ్స్ ఎయిర్‌క్రాఫ్ట్

ప్రపంచవ్యాప్తంగా 12 సంస్థలు ఈవీటోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ తయారీలో ఉండగా.. వీటిని నడపడానికి పైలట్‌ అవసరం లేకుండానే పైకి లేచినప్పుడు, కిందకు దిగేప్పుడు నిటారుగా ప్రయాణిస్తాయి. ల్యాండింగ్, టేకాఫ్‌ కోసం ల్యాండింగ్‌ ప్యాడ్స్‌ అవసరం. ఒక్కో ట్యాక్సీలో నలుగురు ప్రయాణించవచ్చు. ఒకసారి చార్జింగ్‌తో 40 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కిలోమీటరుకు అయ్యే చార్జీ రూ.12 మాత్రమే.

ఈవీటోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ ఖరీదు సుమారు రూ.23 లక్షలు ఉంటుంది. ఎయిర్‌ ట్యాక్సీ సేవలను మూడేళ్లలో సాకారం చేస్తాం. ల్యాండింగ్‌ ప్యాడ్‌ 8 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉంటే చాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం. తొలి దశలో ఈ ప్రాజెక్టు కోసం రూ.1,900 కోట్లు ఖర్చు చేస్తామని కనికా స్పష్టం చేశారు.