Journalists: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ. 2 లక్షలు

ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,ఇంటి నం.10-2-1, సమాచార భవన్, రెండవ అంతస్తు, ఏసీగార్డ్స్, మాసబ్‌ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌కు పంపాలని కోరారు.

Journalists: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ. 2 లక్షలు

Journalists

Updated On : June 25, 2021 / 11:53 AM IST

Journalists: తెలంగాణలో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందనుంది. కాగా కరోనా కారణంగా 70 మంది జర్నలిస్టులు మృతి చెందారు. మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నామని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు.

బాధిత కుటుంబాలకు ఐదేళ్లపాటు నెలకు రూ.3000 చొప్పున పింఛన్ లభిస్తుందని తెలిపారు. ఇక బాధిత కుటుంబంలో పదోతరగతి లోపు చదివే ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1000 చొప్పున అందిస్తామని అల్లం నారాయణ తెలిపారు. కరోనా సోకిన జర్నలిస్టుల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5.15 కోట్లు ఖర్చు చేసిందని తెలియచేశారు.