Jubilee Hills Bypoll Exit Polls: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది ఆ పార్టీనే..! తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్..
కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు.
Naveen Yadav, Sunitha Maganti, Lankala Deepak Reddy
Jubilee Hills Bypoll Exit Polls: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెలువరించాయి.
ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ బూత్‌లు 407, పోలింగ్ కేంద్రాలు 139 ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. 58 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ ఏడాది జూన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఈ ఉపఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు.
ఏ సంస్థ ఏం తేల్చింది?
10టీవీ
కాంగ్రెస్ 46-48 శాతం
బీఆర్ఎస్ 40-42 శాతం
బీజేపీ 8-10 శాతం
స్మార్ట్‌పోల్
కాంగ్రెస్ – 48.2 శాతం
బీఆర్ఎస్ – 42.2 శాతం
బీజేపీ – 7.6 శాతం
హెచ్‌ఎంఆర్
కాంగ్రెస్ – 48.31 శాతం
బీఆర్ఎస్ – 43.18 శాతం
బీజేపీ – 5.84 శాతం
చాణక్య స్ట్రాటజీస్
కాంగ్రెస్ – 46 శాతం
బీఆర్ఎస్ – 43 శాతం
బీజేపీ – 6 శాతం
పబ్లిక్ పల్స్
కాంగ్రెస్ – 48.5 శాతం
బీఆర్ఎస్ – 41.8 శాతం
బీజేపీ – 6.5 శాతం
