KA Paul : కేసీఆర్ ను పరామర్శించిన కేఏ పాల్
ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను కేఏ పాల్ పరామర్శించారు. కేసీఆర్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ka paul
KA Paul..EX CM KCR : యశోదా ఆస్పత్రిలో తుంటి ఎముక సర్జరి తరువాత కేసీఆర్ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎంతోమంది ప్రముఖులు ఆరా తీస్తున్నారు. స్వయంగా వచ్చి పరామర్శిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి పరామర్శించారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా స్వయంగా కేసీఆర్ ను కలిసి పరామర్శించారు. ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ తొందరలోనే కోలుకుంటారని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.
మెగా స్టార్ చిరంజీవి కూడా స్వయంగా ఆస్పత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇలా ఎంతోమంది ప్రముఖులు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. స్వయంగా వచ్చిపరామర్శిస్తున్నారు. రాజకీయంగా ఎన్ని విభేధాలు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి పలకరించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా వెళ్లి పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్.. వడ్డీతో సహా రూ.20కోట్లు చెల్లించాలని నోటీసులు
దీంట్లో భాగంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతు.. గత మూడు రోజులుగా కేసీఆర్ అతి త్వరగా కోలుకుకోవాలని తాను మూడు రోజులుగా ప్రార్థిస్తున్నానని తెలిపారు. డాక్టర్స్, నర్సులు కేసీఆర్ కు ఎంతో చక్కగా సేవలు అందించారన్నారు. కేటీఆర్ ను తాను మొదటిసారి కలిసానని తనతో ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడారని అన్నారు. జీవితంలో ఏం జరిగినా అది మన మంచికే జరుగుతుందని అనుకోవాలన్నారు. రాజకీయాలు వేరు..వ్యక్తిగతం వేరు అన్నారు. అలాగే కేసీఆర్ త్వరగా కోలుకోవటానికి ఓ అద్భుతమైన ఆయిల్ తీసుకొస్తానని..ఆయన కోసం ప్రార్థన చేస్తానని తెలిపారు. కేసీఆర్ త్వరలో సంపూర్ణ స్వస్థత పొందుతారని అన్నారు. కేసీఆర్ ను పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా రావడం.. పరామర్శించడం చాలా మంచి పరిణామం అని ప్రశంసించారు.