Minister Indrakaran Reddy: కడెం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదు.. ఆందోళన చెందాల్సిన అవసరంలేదు..

కడెం ప్రాజెక్టుకు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

Minister Indrakaran Reddy: కడెం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదు.. ఆందోళన చెందాల్సిన అవసరంలేదు..

New Project (1)

Updated On : July 14, 2022 / 1:11 PM IST

Minister Indrakaran Reddy: కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. దీంతో అధికారులు, స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం అర్థరాత్రి నుంచి ఉదయం వరకు అధికారులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని అధికారులు టెన్షన్ పడ్డారు. బుధవారం రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్య అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ప్రాజెక్టు వరద ఉధృతికి 12వ గేట్ దెబ్బతింది. గేట్ లో భారీగా చెత్త పేరుకుపోయింది. దీనికితోడు పలు గేట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒకానొక దశలో ప్రాజెక్టుకు గండికొట్టాలని అధికారులు నిర్ణయించారు. సహజంగానే గండిపడటంతో ఊపిరిపీల్చుకున్నారు.

Kadem Project: ప్ర‌మాద‌పుటంచున క‌డెం ప్రాజెక్టు.. రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన అధికారులు

ఉదయం 10గంటల సమయంలో ప్రాజెక్ట్ కు వరద ఉధృతి తగ్గడంతో డేంజర్ జోన్ నుంచి బయటపడినట్లయింది. కడెం ప్రాజెక్ట్ కెపాసిటీ 7.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వ 4.6 టీఎంసీలు. ఇన్ ఫ్లో లక్షా93వేల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2.9 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కడెం ప్రాజెక్టుకు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

Godavari river : భద్రాచలంలో 61 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం..వంతెనపై రాకపోకలు బంద్

ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రాజెక్టుకు గతంలో ఈ స్థాయి వరదను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. వరద ఉధృతి ఇంకా తగ్గే అవకాశముందని, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేశారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు.